Andhra Pradesh: అబ్దుల్ కలాం పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టారా..? వివాదంపై ఏపీ అధికారుల వివరణ ఇదే..

|

Apr 19, 2023 | 9:34 PM

Vishakhapatnam: గతంలో ‘అబ్దుల్ కలాం వ్యూ పాయింట్’ పేరుతో వైజాగ్‌లో ఉన్న ఓ ప్రాంతానికి ‘వైఎస్ఆర్ వ్యూ పాయింట్’ అని పేరు మార్చడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై మాజీ, ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు..

Andhra Pradesh: అబ్దుల్ కలాం పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టారా..? వివాదంపై ఏపీ అధికారుల వివరణ ఇదే..
Ysr View Point In Vizag
Follow us on

Vishakhapatnam: గతంలో ‘అబ్దుల్ కలాం వ్యూ పాయింట్’ పేరుతో వైజాగ్‌లో ఉన్న ఓ ప్రాంతానికి ‘వైఎస్ఆర్ వ్యూ పాయింట్’ అని పేరు మార్చడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై మాజీ, ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు వైజాగ్ మునిసిపల్ కమీషనర్ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం ‘ఈ వ్యూపాయింట్‌కి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా పేరు పెట్టాలని జీవీఎంసీ నుంచి ఎలాంటి తీర్మానం లేదు. ఇంకా దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పేరు పెట్టడం కోసం మేము 17.3.2023న కాగితంపై మేయర్ అనుమతి తీసుకున్నామ’ని తెలిపారు.

ఇక ఈ వ్యూపాయింట్ వివరాల్లోకి వేళ్లే.. ఇది సీతంకొండ సమీపంలో ఉంది. ఇంకా ఈ వ్యూపాయింట్‌ను గతంలో ప్రభుత్వం కాకుండా వైజాగ్ వాలంటీర్స్ అనే స్వచ్చంద సంస్థ అభివృద్ధి చేసింది. దానికి ఈ సంస్థ అబ్దుల్ కలాం పేరు పెట్టి.. వ్యూ పాయింట్‌ను ఓ మాదిరిగా అభివృద్ధి చేశారు. అయితే ఇటీవల G20 సదస్సు సుందరీకరణలో భాగంగా ఈ వ్యూ పాయింట్‌ను కేంద్ర నిధులు పెట్టి అభివృద్ధి చేశారు. అనంతరం కలాం పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టారు. అయితే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును గవర్నమెంట్ శాశ్వతంగా చట్టప్రకారం చేయాలని.. దీనివల్ల ఆయనకు మన వైజాగ్ ప్రజలు శాశ్వత గౌరవం ఇవ్వడానికి  అందరి సహకారం, ప్రోత్సాహం కోరుతున్నామని వైజాగ్ వాలంటీర్స్ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అంతకముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయమై ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘వైజాగ్‌లోని అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడం బాధకరం’ అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..