Hindu Marriage: ఆంధ్రా అబ్బాయిలు..విదేశీ అమ్మాయిలు.. వేదమంత్రాలు..అగ్ని సాక్షిగా ఒక్కటైన జంటలు..

|

Dec 30, 2021 | 5:02 PM

Hindu Marriage: నిజమైన ప్రేమకు జాతి మతం, కులం. ప్రాంతం ఇవేమీ అడ్డుకావని మరోసారి నిరుపించారు ఈ కొత్త జంటలు..  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఇద్దరు యువకులు వృత్తి రీత్యా విదేశాల్లో..

Hindu Marriage: ఆంధ్రా అబ్బాయిలు..విదేశీ అమ్మాయిలు.. వేదమంత్రాలు..అగ్ని సాక్షిగా ఒక్కటైన జంటలు..
Ap Marriages
Follow us on

Hindu Marriage: నిజమైన ప్రేమకు జాతి మతం, కులం. ప్రాంతం ఇవేమీ అడ్డుకావని మరోసారి నిరుపించారు ఈ కొత్త జంటలు..  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఇద్దరు యువకులు వృత్తి రీత్యా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ.. అక్కడ యువతులను ప్రేమించారు.. తమప్రేమను పెద్దల అంగీకారంతో వివాహ బంధంగా మార్చుకున్నారు. హిందూ సాంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ళు ఏడు అడుగులతో కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం ఓ పెళ్లి వేడెక్కి వేదిక కాగా.. మరో పెళ్లి గుంటూరు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే..

విశాఖ పట్నం జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ గ్రామ సర్పంచ్‌ బండారు ఈశ్వరమ్మ, ముత్యాలనాయుడు కుమారుడు నరేష్‌.. రష్యాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ తనతో పాటు ఉద్యోగం చేస్తున్న రష్యాకు చెందిన యువతి ఇరీనాతో ప్రేమలో పడ్డాడు. తమ ప్రేమను ఇరువురు తల్లిదండ్రులకు చెప్పి.. ఒప్పించి హిందూ సంప్రాదయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. వరుడు స్వగ్రామం కింతాడలో నరేష్, ఇరీనాల పెళ్లి వేడుక బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి ఇరీనా తల్లిదండ్రులు ఆండ్రీ, నేతాలియా భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇరీనా తల్లి ఆండ్రీ కూడా పట్టు చీరను ధరించి సందడి చేశారు. నరేష్ తల్లి ఈశ్వరమ్మ గ్రామ సర్పంచ్. దీంతో ఈ పెళ్లి వేడుకక్కి వైసీపీ శ్రేణులు కూడా హరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహం జరిగిన తర్వాత సింహాద్రి అప్పన్న ఆశీస్సుల కోసం వధూవరులతో కలిసి రెండు కుటుంబాలు సింహాచలం వెళ్ళాయి. కొన్న ఆశీస్సులతో ఈ జంట కలకలం సుఖసౌఖ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం.

 

ఇక బుధవారం మరో ఆంధ్ర అబ్బాయి.. విదేశీ అమ్మాయి మెడలో వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు వేశాడు.. ఈ పెళ్లి వేడుక గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరు ఆత్మ డెప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దమ్మాటి వెంకటేశ్వర్లు కుమారుడు మధుసంకీర్త్‌ ఉద్యోగ రీత్యా టర్కీలో స్థిరపడ్డాడు. తన తో పాటు పనిచేస్తున్న టర్కీకి చెందిన చెందిన గిజెమ్‌ ను ప్రేమించాడు. వీరి పెళ్ళికి ఇరుకుటుంబ సభ్యులు అంగీకరించారు. హిందూ సంప్రదాయం పద్ధతిలో గిజెమ్ మెడలో  తాళి కట్టాడు. గుంటులోని భారత్‌పేట తన్విక ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం రాత్రి  మధు సంకీర్త్, గిజెమ్ వివాహం కరోనా నిబంధనల నడుమ వైభవంగా జరిగింది.

Also Read:  కొరియన్ పాప్ సింగర్ వీ పుట్టిన రోజు వేడుకలు.. భారత్ ఫ్యాన్స్ చేసిన మంచి పని తెలిస్తే.. వావ్ అనకుండా ఉండలేరు..
l