Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Politics: కమ్మ, కాపు ఇలాకాలో బీసీ మహిళల పోరాటం.. గెలిచేదెవరు.. నిలిచేదెవరు..?

తెరపై బీసీ మహిళల ప్రచారం.. తెర వెనుక అగ్రకుల భర్తల రాజకీయం.. రసవత్తరంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలు మారాయి. నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న మహిళలకు తోడుగా మగ మహరాజులు కదం తొక్కుతున్నారు. గెలిచెదెవరైనా ఫైట్ మాత్రం ఆసక్తికరంగా మారింది. గుంటూరు పశ్చిమ రాజకీయాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాక రేపుతున్నాయి.

Guntur Politics: కమ్మ, కాపు ఇలాకాలో బీసీ మహిళల పోరాటం.. గెలిచేదెవరు.. నిలిచేదెవరు..?
Vidadala Rajini Galla Madhavi
Follow us
T Nagaraju

| Edited By: Balaraju Goud

Updated on: Apr 25, 2024 | 12:37 PM

తెరపై బీసీ మహిళల ప్రచారం.. తెర వెనుక అగ్రకుల భర్తల రాజకీయం.. రసవత్తరంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలు మారాయి. నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న మహిళలకు తోడుగా మగ మహరాజులు కదం తొక్కుతున్నారు. గెలిచెదెవరైనా ఫైట్ మాత్రం ఆసక్తికరంగా మారింది. గుంటూరు పశ్చిమ రాజకీయాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాక రేపుతున్నాయి.

కమ్మ సామాజికవర్గ ఓటర్ల పట్టున్న కోట గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇదే నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. తెలుగుదేశం, వైసీపీల నుండి ఇద్దరు బీసీ మహిళలే పోటీ పడుతున్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారంది. వైసీపీ అభ్యర్ధిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన విడదల రజినీ బరిలో ఉంటే, టీడీపీ అభ్యర్ధిగా రజక సామాజిక వర్గానికి చెందిన గళ్లా మాధవి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలే కావడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అయితే మహిళా అభ్యర్ధులకు చెందిన భర్తలు మాత్రం అగ్రకులాలకు చెందిన వారు కావడం విశేషం.

విడదల రజిని భర్త కాపు కులానికి చెందిన వారు. కాగా మాధవి భర్త రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిద్దరూ కూడా తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రచారాలకు మాత్రమే అభ్యర్ధులు పరిమితమైతే భర్తలు మాత్రం తెర వెనుక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. రజిని భర్త కుమార స్వామి ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలందరిని కలిసి తమకే మద్దతు ఇవ్వాలంటూ అడుగుతున్నారు. ఇక మాధవి భర్త రామచంద్రరావు కూడా అటు కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇటు కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని కూడా కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఒక్క కాపు సామాజిక వర్గానికి కూడా టికెట్ ఇవ్వలేదని రాజకీయ పార్టీలపై గుర్రు మీద ఉన్నారు. అయితే కాపుల మద్దతు తమకే ఉంటుందని వైసీపీ భావిస్తుంటే, జనసేనతో జతకట్టడంతో కాపుల ఓట్లు తమకే పడతాయని టీడీపీ అంచనా వేస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలో పోరు కాపు వర్సెస్ కమ్మగా మారిపోయింది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలిద్దరూ కూడా కాపు ఓటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. మరొకవైపు గత ఆరు ఎన్నికలను పరిశీలిస్తే, ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ సాధించలేకపోయింది. 1994, 1999ల్లో టీడీపీ గెలుపొందితే 2004, 2009ల్లో కాంగ్రెస్, 2014, 2019ల్లో టీడీపీ గెలిచింది. దీంతో వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ తమకే వర్కవుట్ అవుతుందిన వైసీపీ భావిస్తుంటే, ఈసారి కాపు ఓట్లతో గెలిచి చరిత్ర తిరగరాస్తామని టీడీపీ అంటుంది. గెలుపు ఎవరిదైనా పోరు మాత్రం రంజుగా సాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..