AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable Zodiac Signs: ఈ రాశుల వారు పట్టువీడని విక్రమార్కులు.. అనుకున్నది సాధిస్తారు..!

ఈ ఏడాది కొన్ని రాశుల వారు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఈ జాబితాలో మేషం, మిథునం, సింహం సహా మరికొన్ని రాశుల వారు ఉన్నారు. వీరు ఎంతో ధైర్యవంతులు, స్వతంత్రులు, తమ లక్ష్యాలను సాధించడంలో అడ్డంకులను లెక్కచేయరు. వారికి అనుకూలమైన గ్రహాల ప్రభావం, సవాళ్లను ఎదుర్కొనే విధానం గురించి ఇక్కడ వివరించడం జరిగింది. వారి వృత్తి, ఆర్థిక జీవితంపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Unstoppable Zodiac Signs: ఈ రాశుల వారు పట్టువీడని విక్రమార్కులు.. అనుకున్నది సాధిస్తారు..!
Unstoppable Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 23, 2025 | 3:33 PM

Share

ద్వాదశ రాశుల్లో కొన్ని రాశుల వారి తీరే వేరు. వీరు ఎవరి మాటా వినరు. సంప్రదాయాలను పాటించరు. నిర్ణయం తీసుకుంటే ఒక పట్టాన మార్చుకోరు. ఎటువంటి సమస్యనైనా, సవాలునైనా ఒంటిరిగానే ఎదుర్కొంటారు. ఈ రాశులుః మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకరం. ఈ రాశుల వారు సాధారణంగా ఇతరుల మీద ఆధారపడరు. వీరి మనస్తత్వానికి తగ్గట్టుగా ఈ ఏడాది కొన్ని గ్రహాలు కూడా వీరికి బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులను ఏమాత్రం లెక్క చేయకుండా వీరు ముందుకు దూసుకుపోతారు. తమ లక్ష్యాలను చేరుకుంటారు.

  1. మేషం: ఈ రాశివారికి ఏడున్నరేళ్ల ‘ఏలిన్నాటి శని’ మొదలైంది. వృత్తి, ఉద్యోగాల్లో, సంపాదనలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారికి అటువంటివేమీ పట్టవు. తమ రూటు మార్చుకుని, చిన్న చిన్న అవకాశాలను సైతం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతారు. పక్కన పిడుగులు పడినా చలించని ఈ రాశివారికి ఈ ఏడాదంతా రాశ్యధిపతి కుజుడు, శుక్రుడు, రవి అనుకూలంగా ఉన్నందువల్ల సాహసాలు చేస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ పురోగతి చెందుతారు.
  2. మిథునం: ఈ రాశివారికి ఆత్మ విశ్వాసం ఎక్కువ. తమ తెలివితేటల మీద నమ్మకం ఒక మోతాదు అధికం గానే ఉంటుంది. బుద్ధి కారకుడైన బుధుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల ఎటువంటి సమస్య నైనా పరిష్కరించుకుంటారు. వివాదాలను అవసరమైతే రాజీమార్గంలో పరిష్కరించుకుని ముందుకు వెడతారు. ఈ ఏడాదంతా ఈ రాశికి బుధ శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఒక ప్రణాళిక ప్రకారం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, షేర్లు, స్పెక్యులేషన్లలో కూడా రాణిస్తారు.
  3. సింహం: ఈ రాశివారికి సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. ఏటికి ఎదురీదడానికి వీరు వెనుకాడరు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత వీరి మాట వీరే వినరు. ఈ రాశికి అధిపతి రవి అయినందువల్ల నాయకత్వ కలిగి ఉంటారు. అష్టమ శని ప్రారంభమైనప్పటికీ, వీరు కష్టాలు పడుతున్న సూచనలు కనిపించకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. గురు, రవి, కుజుల అనుకూలత వల్ల ఈ ఏడాది వీరు అనేక ఘన కార్యాలు సాధించే అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు సర్వ స్వతంత్రుడు. అందువల్ల ఇతరులతో సంప్రదించడమనే లక్షణం ఈ రాశివారిలో తక్కువ. మూడో కంటికి తెలియకుండా వీరు తమ వ్యవహారాలను చక్క బెట్టుకుంటారు. అదృష్టానికి, ఆదాయానికి కారకుడైన గురువు ఈ రాశివారికి ఈ ఏడాదంతా అనుకూలంగా లేనప్పటికి, వీరు ఆదాయాన్ని కూడబెట్టే వారిలో, మదుపు చేసేవారిలో ముందుంటారు. రాశ్యధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా తమ లక్ష్యాలను సాధిస్తారు.
  5. ధనుస్సు: ఈ రాశివారిలో అందరి కంటే ముందుండాలనే కోరిక కాస్తంత ఎక్కువగా ఉంటుంది. రాశ్యధిపతి గురువు అదృష్టానికి, ఆదాయానికి కారకుడైనందువల్ల, ఈ రాశివారిలో ‘యాంబిషన్’ అనేది ఒక మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా మార్చుకోరు. సాహసాలు చేయడానికి ఇష్టపడే ఈ రాశివారు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సంపా దనలో కూడా బాగా పురోగతి సాధిస్తారు. అర్ధాష్టమ శని బాధలను వీరు లెక్కచేయకపోవచ్చు.
  6. మకరం: కష్టనష్టాలను, సుఖ సంతోషాలను సమదృష్టితో చూసే ఈ రాశివారు ఈ ఏడాది బాగా పురోగతి చెందే అవకాశం ఉంది. అదృష్టాన్ని కలిగించే గురువు ఈ ఏడాదంతా అనుకూలంగా లేకపోయినా రాశ్యధిపతి శనీశ్వరుడి అనుకూలత వల్ల గట్టి పట్టుదలతో, మొక్కవోని ధైర్యంతో అనుకున్నవి సాధించుకుంటారు. లక్ష్యాలను చేరుకుంటారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. శ్రమాధిక్యత ఉన్నా అనేక మార్గాల్లో ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటారు.