Andhra Pradesh: మాజీ మంత్రి కాన్వాయ్‌పై రాళ్లదాడి.. ఆ జిల్లాలో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం
కన్నా లక్ష్మీ నారాయణ టిడిపిలో చేరిన తర్వాత ప్రతి గ్రామంలోనూ టిడిపి ఇచ్చిన పిలుపుమేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తొండెపిలో పర్యటించాలని నిర్ణయించారు. అయితే కొంతమంది మైనార్టీలు వైసిపి నుండి టిడిపిలోకి చేరేందుకు సిద్దమయ్యారు. దీంతో కన్నా లక్ష్మీ నారాయణ మైనార్టీల బజారుకు..
వారిద్దరూ సీనియర్ నేతలే. ఒకరు టిడిపిలో ఉండగా మరొకరు వైసిపిలో ఉన్నారు. వీరిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఆ నియోజకవర్గమే సత్తెనపల్లి… సత్తెనపల్లి మండలం తొండపిలో బాబు ష్యూరిటీ… భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి హాజరైన కన్నా లక్ష్మీ నారాయణ కాన్వాయ్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కన్నా వ్యక్తిగత కార్యదర్శితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై సీనియర్ నేతలిద్దరి మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి.
కన్నా లక్ష్మీ నారాయణ టిడిపిలో చేరిన తర్వాత ప్రతి గ్రామంలోనూ టిడిపి ఇచ్చిన పిలుపుమేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తొండెపిలో పర్యటించాలని నిర్ణయించారు. అయితే కొంతమంది మైనార్టీలు వైసిపి నుండి టిడిపిలోకి చేరేందుకు సిద్దమయ్యారు. దీంతో కన్నా లక్ష్మీ నారాయణ మైనార్టీల బజారుకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. కాన్వాయ్ ఆ బజార్లోకి రావటంతోనే ఒక్కసారిగా విద్యుత్ నిలిచిపోయింది. చిమ్మ చీకటిగా ఉండటంతో డాబాలపై చేరిన కొంతమంది వ్యక్తులు కన్నా కాన్వాయ్ పై రాళ్ల వర్షం కురిపించారు. అసలే చీకటి కారు లైట్లు తప్ప ఏమీ కనిపించకపోవడంతో ఆ రాళ్ల దాడిలో ఇరువురు గాయపడ్డారు. అయితే కన్నా గ్రామంలో ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
రాళ్ల దాడిని మంత్రి అంబటి రాంబాబే ప్రోత్సహించారని తనపై హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును ఆయన తప్పు పట్టారు. దాడులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. ఓడిపోతామన్న భయంతోనే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నా వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదన్నారు. పల్నాడులో అత్యంత్య సమస్యాత్మకంగా గ్రామాల్లోకి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
పోలీసులు కంట్రోల్ చేయకుంటే పరిస్థితి మరొక రకంగా ఉండేదన్నారు. గతంలో తాను, ఎంపి తొండపి వెళ్లిన సమయంలోనూ మాపై దాడులు జరిగాయన్నారు. దాడితో కన్నా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. దాడి అనంతరం గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. అత్యంత్య సమస్యాత్మక గ్రామం కావటంతో తిరిగి దాడులు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంబటి, కన్నా సీనియర్ నేతలు కావటం ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో సత్తెనపల్లి రాజకీయం రంజుగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..