TTD: రూ. 5 వేల కోట్లు దాటిన టీటీడీ వార్షిక బడ్జెట్.. ఆ అధ్యాపకులకు గుడ్ న్యూస్..!

ఐదు వేల కోట్లకు పైగా నిధులతో.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది TTD బోర్డ్. అలాగే టీటీడీలో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఎంప్లాయిస్‌కు జీతాలు పెంచారు. స్విమ్స్ ఆస్పత్రి 1200 పడకలకు పెంపు.. టీటీడీలో కొత్త సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఆమోదం తెలిపింది పాలకమండలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

TTD: రూ. 5 వేల కోట్లు దాటిన టీటీడీ వార్షిక బడ్జెట్.. ఆ అధ్యాపకులకు గుడ్ న్యూస్..!
TTD
Follow us
Raju M P R

| Edited By: Ravi Kiran

Updated on: Jan 29, 2024 | 4:07 PM

ఐదు వేల కోట్లకు పైగా నిధులతో.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది TTD బోర్డ్. అలాగే టీటీడీలో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఎంప్లాయిస్‌కు జీతాలు పెంచారు. స్విమ్స్ ఆస్పత్రి 1200 పడకలకు పెంపు.. టీటీడీలో కొత్త సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఆమోదం తెలిపింది పాలకమండలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5 వేల 141 కోట్లతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది పాలకమండలి. టీటీడీ బోర్డ్ ఆమోదించిన నిర్ణయాలను వివరించారు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ ఏడాది నుంచి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టామన్నారు. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా.. బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణంకు ఆమోదం తెలిపామన్నారు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. లడ్డూ ట్రే మోసే కార్మికులకు అదనంగా 15వేలు వేతనం పెంచడంతో పాటు.. వేద పాఠశాల్లో 51 మంది సంభావన అధ్యాపకుల జీతం 34 నుంచి 54వేలకు పెంచాలని నిర్ణయించామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో కొత్త పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. స్విమ్స్ ఆస్పత్రిని 300 పడకల నుంచి 1200 పడకల పెంపుకు 148 కోట్లతో టెండర్‌కు ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డ్.

అన్నమయ్య భవన్ ఆధునీకరణకు కోటి 47లక్షలు కేటాయించింది టీటీడీ బోర్డ్. సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులకు కోటిన్నర.. ఎస్ఎంసితో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు 10 కోట్లు మంజూరు చేసింది. అలాగే టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్ వేర్ వినియోగాన్ని ఆమోదించారు.