AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రోటోకాల్ పక్కనబెట్టి.. రైతు వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రజల వద్దకే పాలన అంటే ఇదే!

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో గుంటూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా ఒక మానవీయ ఘట్టం ఆవిష్కృతమైంది. మంచానికే పరిమితమైన ఒక పక్షవాత బాధితుడు తన భూసమస్యను చెప్పుకోవడానికి ఆటోలో కలెక్టరేట్‌కు వచ్చాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ స్వయంగా కాన్ఫరెన్స్ హాల్ నుండి కిందికి దిగివచ్చారు. నేరుగా ఆటో వద్దే బాధితుడి బాధలను ఆలకించారు. కలెక్టర్ చూపిన ఈ చొరవ, మానవత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

ప్రోటోకాల్ పక్కనబెట్టి.. రైతు వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రజల వద్దకే పాలన అంటే ఇదే!
Guntur Collector Selvarajan
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 4:53 PM

Share

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో గుంటూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా ఒక మానవీయ ఘట్టం ఆవిష్కృతమైంది. మంచానికే పరిమితమైన ఒక పక్షవాత బాధితుడు తన భూసమస్యను చెప్పుకోవడానికి ఆటోలో కలెక్టరేట్‌కు వచ్చాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ స్వయంగా కాన్ఫరెన్స్ హాల్ నుండి కిందికి దిగివచ్చారు. నేరుగా ఆటో వద్దే బాధితుడి బాధలను ఆలకించారు. కలెక్టర్ చూపిన ఈ చొరవ, మానవత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

సోమవారం (జూన్ 08) గుంటూరు కలెక్టరేట్‌లో యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో కలెక్టరేట్ ఆవరణలోకి ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో తీవ్ర అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమైన ప్రత్తిపాడు మండలం యనమదలకు చెందిన డేగల శివనాగరాజు అనే రైతు ఉన్నాడు. కలెక్టర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలని వచ్చాడు. అయితే కనీసం నడవలేని స్థితిలో ఉండటంతో కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లలేక ఆటోలోనే ఉండిపోయాడు. తీవ్ర నీరసం, అలసటతో ఇక లాభం లేదనుకుని వెనుతిరిగి వెళ్లిపోవాలని భావించాడు.

అదే సమయంలో మీడియా ప్రతినిధులు ఆటో వద్దకు వెళ్లి బాధితుడి వివరాలు సేకరిస్తుండటంతో, ఈ విషయం కలెక్టర్ సెల్వరాజన్ దృష్టికి వెళ్లింది. ఓ తీవ్ర అనారోగ్య బాధితుడు ఆటోలో వచ్చి ఇబ్బంది పడుతున్నాడని తెలియగానే, కలెక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాన్ఫరెన్స్ హాల్ నుండి నేరుగా బయటకు వచ్చి ఆటో వద్దకు చేరుకున్నారు.

కలెక్టరే స్వయంగా తన వద్దకు రావడంతో శివనాగరాజు ఉద్వేగానికి లోనయ్యాడు. తన కష్టాన్ని వివరిస్తూ.. యనమదల గ్రామంలో తనకు 2.85 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ప్రస్తుతం తన వైద్య ఖర్చుల నిమిత్తం ఆ భూమిని అమ్మకానికి పెట్టానని చెప్పాడు. అయితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అది 2.63 ఎకరాలుగానే నమోదైందని, దీనివల్ల 22 సెంట్ల భూమి తక్కువై తాను భారీగా నష్టపోతున్నానని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. దీనిపై కలెక్టర్ వెంటనే స్పందిస్తూ.. ఫోన్ ద్వారా ప్రత్తిపాడు తహశీల్దార్‌తో మాట్లాడారు. రీసర్వేలో 2.63 ఎకరాలుగా ఎందుకు నమోదైందో క్షుణ్ణంగా పరిశీలించాలని, మరోసారి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి బాధితుడి భూసమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

కఠినమైన అధికారిక నిబంధనలను పక్కనబెట్టి, తన వద్దకే వచ్చి సమస్యను సానుకూలంగా విని పరిష్కారం చూపిన కలెక్టర్ సెల్వరాజన్‌కు బాధితుడు శివనాగరాజు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపాడు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఇతర బాధితులు, ప్రజలు కూడా కలెక్టర్ స్పందించిన తీరును చూసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..
పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం
పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం
డీ-మార్ట్‌లో చౌకగా షాపింగ్ చేయడం ఎలా? ఎవ్వరికి తెలియని టిప్స్‌!
డీ-మార్ట్‌లో చౌకగా షాపింగ్ చేయడం ఎలా? ఎవ్వరికి తెలియని టిప్స్‌!
పచ్చి గుడ్డు వర్సెస్ ఉడికించిన గుడ్డు.. ఆరోగ్యానికి ఏది మంచిది
పచ్చి గుడ్డు వర్సెస్ ఉడికించిన గుడ్డు.. ఆరోగ్యానికి ఏది మంచిది