Guntur Buffaloes Issue: సచివాలయంలో గేదెల అరెస్ట్‌..! గ్రామస్తులు సిబ్బంది నడుమ వాగ్వాదం.. టెన్షన్‌లో జనాలు

|

Aug 02, 2022 | 1:05 PM

అయితే, ఇక్కడ గేదెలను తీసుకువెళ్లిన అధికారులు.. దూడను తీసుకురాకపోవడంతో అది రంకెలేస్తోంది. స్పందన అర్జీ పరిష్కరించకుంటే తనను సస్పెండ్ చేస్తారని.. అందుకే..

Guntur Buffaloes Issue: సచివాలయంలో గేదెల అరెస్ట్‌..! గ్రామస్తులు సిబ్బంది నడుమ వాగ్వాదం.. టెన్షన్‌లో జనాలు
Guntur Buffalos Issue
Follow us on

Guntur Buffaloes Issue: గుంటూరు జిల్లా ఏటుకూరు సచివాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గేదెలతో సచివాలయాన్ని ముట్టడించారు గ్రామస్తులు. సచివాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఐతే వారిని సచివాలయ సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రెండ్రోజుల క్రితం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తికి చెందిన గేదెలను నిర్బంధించారు సచివాలయ సిబ్బంది. రెండ్రోజులుగా వాటికి గడ్డి, నీరు ఏం పెట్టకుండా మూగజీవాలను పస్తులుంచారని గొడవకు దిగారు గ్రామస్తులు. దీనిపై అధికారులొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నగరపాలక సంస్థ సిబ్బంది, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. గేదేలను తీసుకు వచ్చిన వారే తిరిగి వాటిని అక్కడ వదిలి రావాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో గ్రామంలో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. గొడవకు అసలు కారణం ఏంటంటే..

గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఏటుకూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తన ఇంటి పక్కనున్న గేదెలతో ఇబ్బంది పడుతున్నాని ఆరోపించాడు. గేదెల వల్ల వాసన, దోమలు విజృంభిస్తున్నాయని నగరపాలక సిబ్బంది మొరపెట్టుకున్నాడు. ఏడాది కాలంగా అతడు చూ అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో సానిటరీ సిబ్బంది పలుమార్లు గేదెల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినా.. వారు స్పందించలేదు. దీని మీద వారు న్యాయస్థానం వరకు వెళ్లారు. ఐతే తరచూ.. ఇదే సమస్యపై స్పందనలో ఫిర్యాదు రావడంతో… చేసేదేమీ లేక శానిటరీ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు రైతు శ్రీనివాస్ కు చెందిన గేదెలను తీసుకుని వచ్చి సమీపంలోని సచివాలయం వద్ద కట్టేశారు.

అయితే, ఇక్కడ గేదెలను తీసుకువెళ్లిన అధికారులు.. దూడను తీసుకురాకపోవడంతో అది రంకెలేస్తోంది. స్పందన అర్జీ పరిష్కరించకుంటే తనను సస్పెండ్ చేస్తారని.. అందుకే ఇలా గేదెలను తీసుకువచ్చి సచివాలయం దగ్గర కట్టేయాల్సి వచ్చిందని శానిటరీ సూపర్వైజర్ చెబుతున్నాడు.ఈ క్రమంలోనే మంగళవారం రోజున గ్రామస్తులు సచివాలయాన్ని ముట్టడికి యత్నించారు. నగరపాలక సిబ్బంది, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి