Casino row: గుడివాడలో రాజ్యాంగం అమలవుతోంది.. అక్రమ క్యాసినో నిగ్గు తేల్చండి.. కొడాలి నానిపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ

గుడివాడలో మంత్రి కొడాలి నాని అక్రమంగా క్యాసినో నిర్వహించారని.. మంత్రి అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు.

Casino row: గుడివాడలో రాజ్యాంగం అమలవుతోంది.. అక్రమ క్యాసినో నిగ్గు తేల్చండి.. కొడాలి నానిపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ
Kodali Nani Dgp
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 28, 2022 | 3:07 PM

Gudivada Casino row: ఆంధప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన గుడివాడ క్యాసినో మరోసారి తెరపైకి వచ్చింది. గుడివాడలో మంత్రి కొడాలి నాని(Minister Kodali Nani) అక్రమంగా క్యాసినో నిర్వహించారని.. మంత్రి అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) డీజీపీ(DGP)కి లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. గుడివాడ నియోజకవర్గంను మంత్రి కొడాలి నాని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యేక చట్టం, రాజ్యాంగం అమలు చేస్తున్నారని డీజీపీ రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజలపైన మంత్రి కొడాలి నాని, అనుచరులు వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయని వర్ల రామయ్య ఆరోపించారు.

గుడివాడలో కొడాలి నాని పీనల్ కోడ్ అమలవుతోందని, ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. జనవరి 2022లో గుడివాడలో అక్రమంగా క్యాసినో నిర్వహిస్తున్నట్లు డీజీపీ కార్యాలయానికి అనేక లేఖల ద్వారా నివేదించామని వర్ల రామయ్య లేఖలో ప్రస్తావించారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. 2015లో లంకా విజయ్ మరణం వాస్తవానికి రైలు ప్రమాదంగా మార్చారని, అదీ ఆత్మహత్య అంటూ ఆరోపించారు. అడపా బాబ్జీ మృతికి కొడాలి నాని వేధింపులే కారణమని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని చట్టాలకు అతీతుడు కాదని ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, సంక్రాంతి సందర్భంగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. అయితే, తాను ఎక్కడా క్యాసినో నిర్వహించలేదని మంత్రి నాని స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడు మరోసారి టీడీపీ నేత నేరుగా డీజీపీకి లేఖ రాయటం ద్వారా.. దీని పైన మంత్రి ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.

Read Also….  Andhra Pradesh News: రాళ్లు, కర్రలతో యువకుల హల్చల్‌.. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..