Andhra Pradesh: వారెవ్వా.. ఏం ప్లాన్ గురూ..! చేపలు, రొయ్యలకు రక్షణగా చల్లటి పరదాలు..!

శ్రావణ మాసం మొదలైంది. అయితే ఎండలు మాత్రం రోహిణి కార్తెని తలపిస్తున్నాయి. ఎండల వేడిమి తాళలేక చెరువుల్లో చేపలు , రొయ్యలు విలవిలలాడుతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చేతికి వచ్చిన చేపలు ఎక్కడ చేజారుతాయోనని జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యేకించి ఏరియేటర్స్‌ను ఏర్పాటు చేసి, చేపలను రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

Andhra Pradesh: వారెవ్వా.. ఏం ప్లాన్ గురూ..! చేపలు, రొయ్యలకు రక్షణగా చల్లటి పరదాలు..!
Green Mat Protection

Edited By: Balaraju Goud

Updated on: Aug 07, 2025 | 12:36 PM

శ్రావణ మాసం మొదలైంది. అయితే ఎండలు మాత్రం రోహిణి కార్తెని తలపిస్తున్నాయి. ఎండల వేడిమి తాళలేక చెరువుల్లో చేపలు , రొయ్యలు విలవిలలాడుతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చేతికి వచ్చిన చేపలు ఎక్కడ చేజారుతాయోనని జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యేకించి ఏరియేటర్స్‌ను ఏర్పాటు చేసి, చేపలను రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ఏలూరులో భానుడి భగభగలకు ప్రజలే కాదు, చేపలూ అల్లాడుతున్నాయి. ఎండల నుంచి రక్షణగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మత్స్య వ్యాపారులు తమ చేపలను కాపాడుతున్నారు. ఏలూరు మినీ బైపాస్ రోడ్డులోని మత్స్యశాఖ ఉపసంచాలకుల కార్యాలయం పక్కన ఏర్పాటైన మత్స్య మార్టులో కుండీల్లో చేపలను పెంచ, నగరవాసులకు విక్రయిస్తుంటారు. అయితే ఎండ తీవ్రత కారణంగా నీరు వేడెక్కి, చేపలు విలవిలలాడతున్నాయి. వాటికి అసౌకర్యం కలగకుండా ఉపశమనం కలిగించేందుకు కుండీలపై గ్రీన్ మ్యాట్లను పరదాలుగా ఏర్పాటు చేశారు.

తొట్టెలలో నీరు వేడెక్కితే , చేపలు వేడి తట్టుకోలేక చనిపోతున్నాయి. వీటికి ఉపశమనం కోసం ఈ గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేయటంతో అవి ఉపశమనంగా ఫీల్ అవుతున్నాయి. దీని వల్ల చేపలు మరణించకుండా ప్రాణాలు దక్కటంతోపాటు ఆరోగ్యంగా ఉంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..