గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. కారణం ఇదే!

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. మనస్తాపానికి గురైన ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే పండు నవీన(22) ఇటీవలే పండువారిగూడెంలో గ్రామ వాలంటీర్‌గా విధుల్లో జాయిన్ అయింది. రోజులానే శనివారం ఉదయం గ్రామంలో వివరాలు సేకరిస్తుండగా ఓ మహిళ వచ్చి తన ఆధార్ కార్డు ఎందుకు ఆన్లైన్ చేయడం లేదని నవీనను గట్టిగా ప్రశ్నించింది. సదరు మహిళ అన్న మాటలకు మనస్తాపం […]

గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. కారణం ఇదే!

Edited By:

Updated on: Sep 08, 2019 | 11:04 AM

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. మనస్తాపానికి గురైన ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే పండు నవీన(22) ఇటీవలే పండువారిగూడెంలో గ్రామ వాలంటీర్‌గా విధుల్లో జాయిన్ అయింది. రోజులానే శనివారం ఉదయం గ్రామంలో వివరాలు సేకరిస్తుండగా ఓ మహిళ వచ్చి తన ఆధార్ కార్డు ఎందుకు ఆన్లైన్ చేయడం లేదని నవీనను గట్టిగా ప్రశ్నించింది. సదరు మహిళ అన్న మాటలకు మనస్తాపం చెందిన నవీన రోదిస్తూ ఇంటికి వచ్చింది. తండ్రి శ్రీరామమూర్తికి జరిగిన విషయం చెప్పగా ఆయన వారించి పొలం పనులకు వెళ్లిపోయారు. కాగా ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో నవీన ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.