Andhra Pradesh: ఏపీ సహా యావత్ దేశ రాజకీయాలను షేక్ చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను నిజమైందని కాదని, ఫేక్ అని తేలింది. పోలీసులు ప్రాథమిక విచారణలో ఈ విషయాన్ని ధృవీకరించారు. పోలీసుల ప్రకటనతో ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా ముందుకు వచ్చారు. తనపై దుష్ప్రచారం చేసిన టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మరోవైపు ప్రైవేట్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌కు సంబంధించి టీడీపీకి బిగ్ షాక్ తగిలిగింది. తాము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని ఎక్లిప్స్ ల్యాబ్ తేల్చి చెప్పింది. ఈ అంశంపైనా గోరంట్ల తీవ్రంగా స్పందించారు. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌తో టీడీపీ మరోసారి దొరికిపోయిందని దుయ్యబట్టారు. ఫేక్ వీడియోతో బీసీ ఎంపీని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. అధికారం కోసం చంద్రబాబు ఇంత నాటకాలాడాల్సిన అవసరం లేదని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వీడియో, ఆడియో ఫుటేజీలో తనకు ప్రమేయం లేదని చంద్రబాబు ప్రమాణం చేయగలుగుతారా? అని గోరంట్ల ప్రశ్నించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..