Kadapa: ఏపీ రాష్ట్రంలోని కడప నుంచి ఐదు నగరాలకు విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులు (Indigo Flight Services) ప్రారంభం కానున్నాయి. ఈ సేవలు మార్చి 27 నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, అలాగే మార్చి 29 నుంచి విశాఖ, బెంగళూరుకు సర్వీలు ప్రారంభించనున్నట్లు ఎయిర్‌లైన్స్ (Airline) ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో విమానాల (Flights)తో అనుసంధానించిన వాటిలో దేశంలో73వ నగరంగా కడప నిలవనుందని ఇండిగో తెలిపింది. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మెల్లమెల్లగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్ నుంచి కోలుకునే సమయంలోనే చమురు ధరలు పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతోపాటు విమానయాన సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన లోటును పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
కాగా, ఇంతలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు సోమవారం డీల్స్‌లో 4 క్షీణించాయి. కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ శుక్రవారం కంపెనీ బోర్డు నుంచి వైదొలగారు.
ఇవి కూడా చదవండి: