Special Trains: భారతీయ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు నడిచే రూట్స్, టైమింగ్స్, స్టాప్స్ తెలుసుకోండి. ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. పలు రూట్లలో పలు రైళ్లను నడుపుతోంది భారతీయ రైల్వేశాఖ. అందులో భాగంగా మరో రెండు ప్రత్యేక రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ రైళ్లు యశ్వంత్‌పూర్- హౌరా రూట్‌లో నడుస్తాయి. ఏపీలోని విజయవాడ, విశాఖతో పాటు పలు స్టేషన్‌లలో ఆగుతాయి. 06597 గల రైలు నెంబర్ నుంచి హౌరా మధ్య ప్రయాణిస్తుంది. 2021 జూన్ 24 వరకు ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. ఉదయం 9.055 గంటలకు యశ్వంత్‌పూర్‌లో రైలు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హౌరా చేరుకుంటుంది. ఈ రైలు విజయవాడ, విశాఖ స్టేషన్‌లతో పాటు రేణిగుంట, గూడూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది.
ఇక రైలు నెంబర్ 06598 హౌరా నుంచి యశ్వంత్‌పూర్ మధ్య ప్రయాణిస్తుంది. 2021 ఏప్రిల్ 27 నుంచి జూన్ 29 వరకు ప్రతి మంగళవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12.40 గంటలకు హౌరాలో రైలు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.40 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. దారిలో విజయవాడ, విశాఖ రైల్వే స్టేషన్‌లతో పాటు రేణిగుంట, గూడూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది.
ఇవీ చదవండి: Southern Railway Jobs: రైల్వే పారామెడికల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. 191 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Corona Vaccine: రూ. 400 కోట్లతో కోటి డోసుల టీకాలు కొనుగోలు చేస్తాం : కర్ణాటక ముఖ్యమంత్రి