Pulasa Fish: పులస చేప గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుస్తలు అమ్మైనా సరే పులస తినాలని అనే సామెత పుట్టిందంటేనే దీని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. వేల కిలోమీటర్ల దూరం నుంచి ఖండంతరాలు దాటుతూ వచ్చే ఈ చేపకు ఉన్న క్రేజే వేరు. నీటికి ఎదురీదే లక్షణమున్న ఏకైక చేపగా పులస ప్రసిద్ధి చెందింది. సముద్రం నుంచి రివర్స్‌గా గోదావరిలోకి ప్రవేశించే పులస రుచికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులసను తినాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పులస చేపను వేలంలో దక్కించుకునేందుకు క్యూ కడుతుంటారు జనాలు. గోదావరి నదిలో మాత్రమే లభించే పులస ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తోంది. దీంతో పులసను సొంతం చేసుకునేందుకు జనాలు పోటీపడుతున్నారు. వేల రూపాయలను సైతం లెక్కచేయకుండా ఖర్చు చేస్తున్నారు.
తాజాగా యానంలో నిర్వహించిన వేలం పాటలో పులసను సొంతం చేసుకోవడానికి జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యానంలో ఓ జాలరికి దొరికి చేపను వేలం పాట వేశారు. ముందుగా నిర్వాహకులు ఈ చేపను రూ. 30 వేల నుంచి వేలంపాట ప్రారంభించారు. అనంతరం మొత్తాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. రూ. 17 వేల రూపాయలకు ఓ వ్యక్తి ఆ పులసను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రాంత ప్రజలైతే మా పులస గొప్పతనం ఏంటో చూశారా? అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తిప్పి కొడితే రెండు కిలోలు కూడా ఉండని ఓ చేప రూ. 17 వేలు పలకడం నిజంగానే వింత కదూ. కొన్ని సందర్భాల్లో పులసను ఏకంగా రూ. 50 వేలు పెట్టి కొనుగోలు చేసిన వారు కూడా ఉన్నారు. ఇలా పులస చేపకు ఉన్న ప్రాధాన్యత రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.
Covid-19 Vaccine: గుడ్‌న్యూస్.. చిన్నారులకు కోవిడ్ టీకాలు ఎప్పటి నుంచో వెల్లడించిన కేంద్ర మంత్రి..