AP News: మామిడితోటలో ఆ వ్యవహారమంటూ పోలీసులకు ఫోన్.. వెళ్లి చెక్ చేయగా స్టన్

|

Apr 28, 2024 | 10:06 PM

ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. పోలీసులు విసృత తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి చోటా, సమచారం వచ్చిన ప్రతి ప్రాంతంలో తనిఖీలు జరుపుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. మామిడితోటలోని ఓ గదిలో ఉన్నది చూసి కంగుతిన్నారు. డీటేల్స్......

AP News: మామిడితోటలో ఆ వ్యవహారమంటూ పోలీసులకు ఫోన్.. వెళ్లి చెక్ చేయగా స్టన్
Mango Farm
Follow us on

కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలోని ఓ మామిడి తోటలో అక్రమ మద్యం భారీగా పట్టుబడడం కలకలం రేపింది. గన్నవరం మాజీ సర్పంచ్ గూడపాటి తులసిమోహన్ కుటుంబానికి చెందిన మామిడి తోటలో గోవా మద్యం భారీగా నిల్వ చేశారు. గూడపాటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో ఎన్నికల అధికారులతోపాటు స్థానిక పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 58,080 మద్యం క్వాటర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. సుమారు 75 లక్షల 50 వేల రూపాయలు విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు పోలీసులు. మామిడి తోటలో మద్యం నిల్వ ఉంచిన గూడపాటి దుర్గాప్రసాద్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. లిక్కర్‌ నిల్వ వెనుక ఎవరు ఉన్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఇక.. గన్నవరం మాజీ సర్పంచ్ తులసిమోహన్‌.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎలక్షన్ సమయంలో ఈ స్థాయిలో గోవా లిక్కర్ నిల్వ చేయడం వెనుకున్న కారణాలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏ మార్గంలో ఈ మద్యం తీసుకువచ్చారు, ఎప్పట్నుంచి తెస్తున్నారు..  ఎవరు తెచ్చారు, ఎవరి కోసం తీసుకువచ్చారనే దానిపై విచారణ కొనసాగుతోంది. అయితే ఈ స్థాయిలో లిక్కర్ దొరకడం స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..