అతివేగం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని కబళించింది. తల్లి కళ్లెదుటే ఆ చిన్నారి ఉసురు తీసింది. అంగన్ వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం చేసిన బాలిక.. తన తల్లి వద్దకు వెళ్లేందుకు రోడ్డు దాటబోయింది. వద్దని తల్లి వారిస్తున్నా, వేగంగా వస్తున్న ఆటోను చూసి కేకలు పెట్టినా ఆటో డ్రైవర్ గానీ, చిన్నారి గానీ వినలేదు. తల్లి దగ్గరకు వెళ్తున్నానన్న ఆనందం ఆ చిన్నారిలో ఎంతో సేపు నిలవలేదు. ‘రావొద్దు బిడ్డా.. అక్కడే ఉండు.. నేనే వస్తున్నా’అనే మాటలే ఆ తల్లికి తన కూతురితో మాట్లాడిన ఆఖరి మాటలయ్యాయి. తల్లి చూస్తుండగానే చిన్నారిని ఆటో ఢీ కొట్టింది(Accident). ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ప్రకాశం జిల్లా(Prakasham District) ఎల్.కోట గ్రామానికి చెందిన సురేష్, మనోహరమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. సురేష్ ఆటో డ్రైవర్ గా పని చేస్తుండగా.. మనోహరమ్మ ఆశా కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. వారి కుమార్తె అవనితార స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటోంది.
శనివారం అంగన్ వాడీ కేంద్రంలో అవనితార మధ్యాహ్న భోజనం చేసి, రోడ్డుకు అవతలి వైపు ఉన్న తల్లి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించింది. చిన్నారి రోడ్డు దాటుతుండగా కూలీలతో వేగంగా వెళ్తున్న ఆటో ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన తారను చికిత్స నిమిత్తం కంభం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వేగంగా ఆటో నడిపి చిన్నారి మృతికి కారణమైన కందులాపురానికి చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు.. తప్పు చాలా తీవ్రమైనదని వ్యాఖ్య