Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vallabhbhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Vallabhbhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పంజాబ్‌లోని మొహాలీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం..

Vallabhbhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 22, 2022 | 8:02 AM

Vallabhbhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పంజాబ్‌లోని మొహాలీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో వంశీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. వంశీ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ హైదరాబాద్‌లో గత సంవత్సరం సీటు సాధించారు. అడ్వాన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం ఇన్‌ పబ్లిక్‌ పాలసీ కోర్స్ చేస్తున్నారు. ఇక సోమవారం నుంచి పంజాబ్‌లోని మొహాలీ క్యాంపస్‌లో తరగతులకు హాజరవుతున్నారు.

మంగళవారం క్లాస్‌కు వెళ్లిన వంశీకి ఎడమ చేయి లాగినట్లు అనిపిస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వంశీకి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి