Andhra Pradesh: పైకేమో మొక్కజొన్న పంట.. లోనకెళ్లి చూడగా పోలీసులకు దిమ్మతిరిగిపోయింది..

తులసి వనంలో గంజాయి మొక్క సామెతను.. మీరు వినే ఉంటారు. ఈ సామెతను ఏకంగా నిజం చేశాడు ఓ రైతు. మొక్క జొన్న తోట మధ్యలో గంజాయి చెట్లను పెంచిన ఆ ప్రబుద్దుడు.. స్థానికులతో పాటు పోలీసులకు కూడా పెద్ద షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి.? ఎక్కడ జరిగింది.? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..

Andhra Pradesh: పైకేమో మొక్కజొన్న పంట.. లోనకెళ్లి చూడగా పోలీసులకు దిమ్మతిరిగిపోయింది..
Crop Cultivation

Edited By:

Updated on: Oct 07, 2023 | 7:39 PM

శ్రీసత్యసాయి జిల్లా, అక్టోబర్ 7: తులసి వనంలో గంజాయి మొక్క సామెతను.. మీరు వినే ఉంటారు. ఈ సామెతను ఏకంగా నిజం చేశాడు ఓ రైతు. మొక్క జొన్న తోట మధ్యలో గంజాయి చెట్లను పెంచిన ఆ ప్రబుద్దుడు.. స్థానికులతో పాటు పోలీసులకు కూడా పెద్ద షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందామా..

ఎక్కడో విశాఖ మన్యంలో పెంచే గంజాయి మొక్కలను మనం సాగు చేయకూడదా అనుకున్నాడో రైతు.. ఏమో.! చాలా పద్ధతిగా గంజాయి సాగు మొదలుపెట్టేశాడు ఆ రైతు. అందరూ చేసే వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కావడం లేదని.. ఏకంగా గంజాయి తోటే సాగు చేయడం మొదలుపెట్టేశాడు. చుట్టూ పచ్చని పంట పొలాలు మధ్యలో గంజాయి తోటను వేసేశాడు. తులసి వనంలో గంజాయి మొక్క అన్న సామెత మనం వినే ఉంటాం… దాన్ని నిజం చేశాడు ఆ ప్రబుద్ధుడు. మొక్కజొన్న తోట మధ్యలో ఎవరికీ కనిపించకుండా ఉంటుందని ఏకంగా గంజాయి మొక్కలే పెంచసాగాడు. కొద్దికొద్దిగా గంజాయి సేకరించి అమ్మడం మొదలుపెట్టాడు. చుట్టూ ఎతైన మొక్కజొన్న తోట ఉంది.. కాబట్టి ఎవరికీ కనపడదు అనుకున్నాడో ఏమో?? గంజాయి మొక్కలను సాగు చేయడం కంటిన్యూ చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా మొక్కజొన్న తోటలో పెంచుతున్న గంజాయి మొక్కల వ్యవహారం ఎట్టకేలకు పోలీసులకు తెలిసింది. ఇంకేముంది మనోడు కటకటాల పాలవ్వాల్సి వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా అగలి మండలం పూలపల్లి గ్రామం సమీపంలో ఓ రైతు మొక్కజొన్న పంటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నాడని సమాచారం రావడంతో మడకశిర సీఐ సురేష్ బాబు పొలంలోకి వెళ్లి చూసి షాక్ అయ్యాడు. మొక్కజొన్న పంట మధ్యలో ఉన్న గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. మొక్కజొన్న తోటలో గంజాయి సాగు చేస్తున్న రైతును అరెస్ట్ చేసిన పోలీసులు.. గంజాయి మొక్కలను తొలగించారు. ఆ రైతు ఆలోచనకు పోలీసులు ఔరా.? అంటున్నారు. ఈ తెలివి ఏదో వ్యవసాయం మీద చూపిస్తే ఆదర్శ రైతు అయ్యి ఉండేవాడు అంటున్నారు స్థానికులు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..