Vijayawada: RTC బస్సు ఆపిన పోలీసులు.. కంగారుగా ఇద్దరు పాసింజర్స్.. వారి బాగ్యులు చెక్ చేయగా..

మోనార్క్ గాళ్లు ప్రజంట్ సొసైటీలో కోకొల్లలు. క్రైమ్‌ను ఎంత క్రియేటివ్‌గా చేయాలో కూడా వారికి తెల్సు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. పోలీసులకు చిక్కకుండా తమ మార్క్ స్ట్రాటజీలతో దూసుకుపోతారు. తాజాగా అలా జట్టు కట్టిన ఓ బ్యాచ్‌ తిక్క కుదిర్చారు పోలీసులు. 

Vijayawada: RTC బస్సు ఆపిన పోలీసులు.. కంగారుగా ఇద్దరు పాసింజర్స్.. వారి బాగ్యులు చెక్ చేయగా..
Rtc Bus (Representative image)

Updated on: Mar 31, 2024 | 6:48 PM

జాదూగాళ్లు, కంత్రీగాళ్లు సొసైటీలో కోకొల్లలు. క్రైమ్‌ను ఎంత క్రియేటివ్‌గా చేయాలో కూడా వారికి తెల్సు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. పోలీసులకు చిక్కకుండా తమ మార్క్ స్ట్రాటజీలతో దూసుకుపోతారు. తాజాగా అలా జట్టు కట్టిన ఓ బ్యాచ్‌ తిక్క కుదిర్చారు పోలీసులు.  ఆర్టీసీ బస్సులో వీరు ఏకంగా గంజాయి రవాణాకు పూనుకున్నారు.  గుట్టుచప్పుడు కాకుండా బస్సులో తరలిస్తున్న 8 కేజీల గంజాయిను పోలీసులు గూడవల్లి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి స్వాధీనపరుచుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల నేపథ్యంలో డీసీపీ అదిరాజ్‌ సింగ్‌ రాణా నేతృత్వంలో సిబ్బంది గూడవల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాల చెకింగ్ చేపట్టారు. ఈనెల 29న రాత్రి సమయంలో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న RTC బస్సును ఆపి సోదాలు నిర్వహించారు. బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన అసోం, నవగావ్‌ జిల్లాకు చెందిన అబ్దుల్‌ రఫిక్‌, బెంగుళూరుకు చెందిన ముజామిల్‌ బాషా… పోలీసులను చూడగానే బస్సు దిగి పారిపోయేందుకు ట్రై చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని వారి బ్యాగుల్లో సోదాలు చేశారు. ఒక్కొక్క బ్యాగ్‌లో 4 కేజీల చొప్పున 2 బ్యాగ్‌లలో 8 కేజీల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ఏరియాలో గంజాయి కొనుగోలు చేసి బెంగుళూరు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. గంజాయిని సీజ్ చేసిన పోలీసులు వారిద్దరినీ స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..