Viral News: కుక్కపై ప్రేమను ఇలా కూడా చూపిస్తారా ?

| Edited By: Velpula Bharath Rao

Oct 03, 2024 | 4:15 PM

మనిషి ఒంటరిగా జీవించలేడు.. సంఘజీవి. తోటి మనుషులతో మాత్రమే కాకుండా భూమి మీద బ్రతికే ఇతర జీవులను మచ్చిక చేసుకోవటం, వాటి ఆలనా పాలనా చూసుకుంటూ తన అవసరాలకు అనుగుణంగా వాటిని ఉపయోగించుకోవటం సహజం. కుక్క విశ్వాసానికి ట్రేడ్ మార్క్‌గా ఉంది. కాస్త ఆకలి తీరిస్తే చాలు మనిషి అతడి ఇంటిని అంటి పెట్టుకుని కాపలాగా ఉండడమే గాక రక్షణగాను ఉంటుంది.

Viral News: కుక్కపై ప్రేమను ఇలా కూడా చూపిస్తారా ?
Funeral For Dog
Follow us on

మనిషి ఒంటరిగా జీవించలేడు.. సంఘజీవి. తోటి మనుషులతో మాత్రమే కాకుండా భూమి మీద బ్రతికే ఇతర జీవులను మచ్చిక చేసుకోవటం, వాటి ఆలనా పాలనా చూసుకుంటూ తన అవసరాలకు అనుగుణంగా వాటిని ఉపయోగించుకోవటం సహజం. కుక్క విశ్వాసానికి ట్రేడ్ మార్క్‌గా ఉంది. కాస్త ఆకలి తీరిస్తే చాలు మనిషి అతడి ఇంటిని అంటి పెట్టుకుని కాపలాగా ఉండడమే గాక రక్షణగాను ఉంటుంది. అందుకే చాలామంది ఇప్పటికి పొలాలు , ఇల్లు , వ్యవసాయ క్షేత్రాలకు సీసీ కెమెరాలు అమర్చినా కుక్కలను సైతం పెంచుకుంటున్నారు. మరికొందరిలో ఇంకా చాలా విశ్వాసాలు ఉన్నాయి. మనిషి కంటే కుక్కకి గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఇక దాని సేవలు పొందినవారు , దానిపై అభిమానం పెంచుకున్న వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ కృతజ్ఞత చూపిస్తుంటారు. ఇందులో భాగంగా కొందరైతే పెంపుడు కుక్కలకు పుట్టినరోజు ఫంక్షన్లు సైతం జరిపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

అయితే ఇక్కడ మాత్రం తాను పెంచుకున్న కుక్కపై అంతకన్నా ఎక్కువ ప్రేమాభిమానం చూపుతూ అది మరణించిన తర్వాత మనిషికి ఏ విధంగా కర్మలు నిర్వహిస్తారో దానికి కూడా అదే విధంగా చేయడం స్థానికులకు ఆశ్చర్యం వేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది.. తాడేపల్లిగూడెం కరకట్ట ఏరియాలో నాగభూషణం అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయనకు పెంపుడు జంతువులైన కుక్కలంటే ఎంతో అపారమైన ప్రేమ. వాటిని కన్నబిడ్డలకంటే ముద్దుగా ప్రేమతో పెంచేవారు. అయితే ఇటీవల ఆయన పెంపుడు కుక్క టైగర్ మృతి చెందింది. సుమారు 13 సంవత్సరాల వయసున్న టైగర్ అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయింది.

దాంతో ఆయన ఎంతో కుమిలిపోయారు. అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు ఏ విధంగా అంత్యక్రియలు నిర్వహిస్తారో సేమ్ టు సేమ్ అదే విధంగా చనిపోయిన కుక్క టైగర్‌కు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. టైగర్ పెద్దకర్మ కూడా ఎంతో ఘనంగా చేశారు. టైగర్ పెద్దకర్మ రోజున పండితులను తీసుకువచ్చి శాస్త్రవేత్తంగా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, టైగర్ ఫోటోను ఫ్రేమ్ చేయించి దానికి ఇష్టమైన స్వీట్స్ ఫోటో ముందు ఉంచారు. అదేవిధంగా సమీపంలో కుక్కలకు దాని గుర్తుగా భోజనాలు పెట్టారు. అలాగే తమ ఇరుగుపొరుగువారు, బంధువులకు సైతం పలు రకాల వెరైటీలతో భోజనాలు పెట్టారు. అయితే గతంలో చనిపోయిన కుక్క ఫోటో, ఇటీవల మరణించిన టైగర్ ఫోటోలను తమ ఇంట్లో చనిపోయిన బంధువుల ఫోటోల పక్కన పెట్టి వాటిపై ఆయనకు ఉన్న ప్రేమను తెలిపారు.