Andhra: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. వీటిల్లో మహిళలకు ఫ్రీ జర్నీ వర్తించదు

ఏపీలో ఈనెల 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుంది. ఇప్పటికే స్త్రీశక్తి పథకం ప్రారంభంపై జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో స్త్రీలకు ఉచిత ప్రయాణం ఉండగా.. అర్హులైన ప్రయాణికులకు జీరో ఫేర్‌ టికెట్లు జారీ చేయనున్నారు.

Andhra: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. వీటిల్లో మహిళలకు ఫ్రీ జర్నీ వర్తించదు
Andhra News

Updated on: Aug 13, 2025 | 8:08 AM

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పథకం కింద నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్‌, చార్టర్డ్‌, ప్యాకేజ్ టూర్ బస్సులకు మాత్రం ఈ పథకం వర్తించదు. అలాగే, తిరుమల-తిరుపతి ఘాట్‌ రోడ్‌లో తిరిగే సప్తగిరి, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అలాగే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఈ పధకాన్ని మినహాయింపు ఇచ్చారు. అలాగే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మధ్య తిరిగే ఇంటర్ స్టేట్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం కల్పించలేదు సర్కార్.

అటు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీ జర్నీ స్కీమ్ అమలౌతుంది. ఏపీలో నివాసం ఉంటున్నట్టు ధృవీకరణ ఉంటేచాలు, బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు ఉచిత ప్రయాణం చెయ్యొచ్చు. అర్హులైన ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు ఇస్తారు. ఆ ఖర్చు మొత్తాన్ని RTCకి ప్రభుత్వమే పరిహారంగా చెల్లిస్తుంది.

అటు.. మహిళా కండక్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు, అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటౌతాయి. టిమ్ మెషిన్లలో సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసి, జీరో టికెటింగ్‌పై కండక్టర్లకు శిక్షణ ఇచ్చింది ఆర్టీసీ. బస్ స్టేషన్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కూడా మెరుగుపరుస్తారు. సాంకేతికపరంగా కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది. టిమ్ మెషిన్లలో సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసి, జీరో టికెటింగ్‌పై కండక్టర్లకు శిక్షణ ఇచ్చింది. అవగాహన కోసం డిపోల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి