Students Missing: సినిమాకు వెళ్లారని టీచర్ల మందలింపు.. నలుగు విద్యార్థుల అదృశ్యం.. తల్లిదండ్రుల ఆందోళన..

గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్ధుల అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న మధ్యాహ్నం స్కూల్ నుంచి నలుగురు విద్యార్థులు సినిమా కి వెళ్లడంతో టీచర్లు మందలించారు.

Students Missing: సినిమాకు వెళ్లారని టీచర్ల మందలింపు.. నలుగు విద్యార్థుల అదృశ్యం.. తల్లిదండ్రుల ఆందోళన..
Mangalagiri Guntur District

Updated on: Dec 07, 2021 | 9:36 AM

Students Missing: గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్ధుల అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న మధ్యాహ్నం స్కూల్ నుంచి నలుగురు విద్యార్థులు సినిమాకి వెళ్లడంతో టీచర్లు మందలించారు. తల్లిదండ్రులను తీసుకొని రమ్మని చెప్పి ఇంటికి పంపించారు. అయితే ఆ నలుగురు స్టూడెంట్స్‌ ఇంటికి వెళ్లలేదు. నిన్నటి నుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి టిప్పర్ల బజార్ లో ఉన్న మున్సిఫల్ పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు బడికి వెళ్ళి తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాజీవ్ గృహకల్పలో నివాస ముండే నలుగురు విద్యార్థులు వెంకట్, ప్రభు దేవా, సంతోష్, వెంకీ ఎప్పటిలాగే నిన్న స్కూల్ కు వచ్చారు.

స్కూల్ నుండి ఎవరికి చెప్పకుండా అఖండ సినిమాకి వెళ్ళారు. సినిమా అయిన తర్వాత తిరిగి స్కూల్ కు వచ్చారు. సినిమాకి వెళ్ళిన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించి తల్లిదండ్రులను పిలుచుకొని రావాలని ఇంటికి పంపారు.

దీంతో స్కూలు నుండి బయలు దేరిన విద్యార్థులు ఇంటికి వెళ్ళలేదు. రాత్రి వరకూ వేచి చూసిన తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: AP Government: భూమిస్తేనే లేఅవుట్లకు అనుమతి.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

Tiger: భయం గుప్పిట్లో భూపాలపల్లి జిల్లా.. పెద్ద పులి సంచారంతో వణుకుతున్న అటవి గ్రామాలు..

Loading...
Unable to load recommendations.
Follow Us