AP News: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. నలుగురు చిన్నారులు మృతి.. ఈత కొడుతుండగా..

|

May 20, 2022 | 8:34 AM

నలుగురు చిన్నారులు పొలంలో ఉండే ఫారం పాండు (గచ్చు) లో ఈత కొడుతుండగా నీటిలో విద్యుత్ సరఫరా అయింది.

AP News: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. నలుగురు చిన్నారులు మృతి.. ఈత కొడుతుండగా..
Electric Shock
Follow us on

Kurnool District: ఏపీలోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్రిష్ణగిరి మండలం అలంకొండ గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. నలుగురు చిన్నారులు పొలంలో ఉండే ఫారం పాండు (గచ్చు) లో ఈత కొడుతుండగా నీటిలో విద్యుత్ సరఫరా అయింది. దీంతో విద్యుత్ షాక్ తో నలుగురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. దీంతో అలంకొండ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన చిన్నారులు.. కార్తీక్ (13), సాయి (12), రాకేష్ (12), కమల్ (12) గా గుర్తించారు.

గత రెండు రోజులుగా గాలివానకు విద్యుత్ వైర్లు తెగి గచ్చు లో పడ్డాయి. ఇది గమనించని పిల్లలు గచ్చులో ఈతకు దిగగానే విద్యుత్ షాక్కు గురయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సంఘటన జరిగితే రాత్రి వరకు ఎవరికీ తెలియదు. తమ పిల్లలు ఎటు పోయారు అని ఆందోళనకు గురవుతూ కుటుంబసభ్యులు వెతికారు.

ఇవి కూడా చదవండి

గచ్చు బయట దుస్తుల కనిపించడంతో అక్కడ వెతకగా… నాలుగు మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే రెవెన్యూ పోలీసు అధికారులు గ్రామానికి వెళ్లి పంచనామా చేశారు.