విశాఖపట్నం, డిసెంబర్21; ఎన్‌ఫోర్స్ మెంట్ వర్గాలు ఎంత నిఘా పెట్టినప్పటికీ.. రోజుకో స్టైల్ లో గంజాయి స్మగ్లర్లు గంజాయి తరలించుకుపోతున్నారు. డిఫరెంట్ స్టైల్ లో గంజాయి రవాణా చేసేస్తున్నారు. తాజాగా.. పాడేరు ఏజెన్సీలో సెబ్ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో మరో గంజాయి గుట్టు బయటపడింది. కారు వెనుక భాగంలో అర ఏర్పాటు చేసి గుట్టుగా గంజాయి అక్రమ రవాణా సాగిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
– పాడేరు మండలం గుత్తులపుట్టు సంత బయలు వద్ద ఎస్ ఈ బి అధికారులు తనిఖీలు చేశారు. అప్పుడే.. DL 12c 7946 నెంబరు ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో ఓ కారు అనుమానాస్పదంగా వస్తున్నట్టు గుర్తించ్చారు. కారును ఆపే సరికి పొంతన లేని సమాధానాలు చెప్పారు అందులో ప్రయానిస్తున్న వాళ్ళు. ఇక.. వాహనం పక్కకు ఆపి తనిఖీ చేసేసరికి అందులో ఏమీ కనిపించలేదు.
కానీ.. ఎక్కడో డౌట్..!
కానీ ఎక్కడో డౌట్..! డిల్లి వాహనం ఏజెన్సీలో ఎందుకని..?! మళ్లీ అనుమానం వచ్చి వెరిఫై చేసేసరికి.. కారు వెనుక భాగంలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కారులో వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేసరికి.. అసలు వ్యవహారాన్ని బయటపెట్టారు. కారు వెనుక భాగంలో ప్రత్యేక అర ఏర్పాటు చేసి.. సిగ్నల్ లైట్స్ లోపల నుంచి గంజాయి కుక్కి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. 85 కిలోల గంజాయితో నలుగురిని అరెస్టు చేశారు. ఒకరు పరారయ్యారు.
– పట్టుబడిన గంజాయి ఐదు లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రిక్ కుమార్, అమిత్ కుమార్, పెదబయలు మండలం కిముడుపల్లి సున్నపు కోట బుల్లి బాబు, నరసింహ మూర్తిలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న జగన్నాధాన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు అధికారులు. కారు తో పాటు పైలెట్ వాహనన్ని కూడా సీజ్ చేశామని అన్నారు ఎస్ ఈ బి ఏఈఎస్ DVG రాజు.
ఒడిస్సా టు నార్త్ స్టేట్స్ వయా ఏజెన్సీ..
– గంజాయి ఒడిశాలో కొనుగోలు చేసినట్టు గుర్తించ్చారు. అల్లూరి ఏజెన్సీ మీదుగా సరిహద్దులు దాటించి ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. బ్యాక్ వార్డ్ లింకులను కూపి లాగే పనిలో పడ్డారు ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..