Janasena: పవన్‌ కల్యాణ్‌కు లేఖలపై లేఖలు రాస్తున్న మాజీ ఎంపీ హరిరామజోగయ్య.

|

Feb 25, 2024 | 8:56 PM

టీడీపీ-జనసేన పొత్తులో సీట్ల కేటాయింపు.. నేతల మధ్య కుస్తీకి తెరలేపింది. పవన్‌ కల్యాణ్‌కు లేఖలపై లేఖలు రాస్తున్న మాజీ ఎంపీ హరిరామజోగయ్య.. లేటెస్ట్‌గా మరో లేఖ సంధించారు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం.. పొత్తు ధర్మం అనిపించుకోదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. హరిరామజోగయ్య లేఖలపై జనసేన నేత పంతం నానాజీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Janasena: పవన్‌ కల్యాణ్‌కు లేఖలపై లేఖలు రాస్తున్న మాజీ ఎంపీ హరిరామజోగయ్య.
Harirama Jogaiah Pawan Kalyan
Follow us on

ఓవైపు వైనాట్ 175 అంటూ దూసుకెళ్తోంది అధికారపక్షం. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా కలిసి వెళ్తున్నామని చెబుతోంది ప్రతిపక్షం. పొత్తు పెట్టుకుని వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనేది ఈ పొత్తు ప్రధాన లక్ష్యం. కాని, ఓట్లు చేజారకూడదనే 24 సీట్లు తీసుకున్నామని అనడమే చెప్పుకోడానికి, వినడానికి బాగోలేదనేది జనసేన నాయకుల వర్షన్. రెండు పార్టీల మధ్య ఓట్లు బదిలీ కావాలన్నదే పొత్తు పెట్టుకోవడం వెనక ప్రధాన ఉద్దేశం. ఆ ఓట్లే బదిలీ కానప్పుడు.. అసలు ఈ పొత్తుకు అర్ధమే లేదు కదా అని గట్టిగా చెబుతున్నారు పార్టీ నేతలు.

టీడీపీ-జనసేన పొత్తులో సీట్ల కేటాయింపు.. నేతల మధ్య కుస్తీకి తెరలేపింది. పవన్‌ కల్యాణ్‌కు లేఖలపై లేఖలు రాస్తున్న మాజీ ఎంపీ హరిరామజోగయ్య.. లేటెస్ట్‌గా మరో లేఖ సంధించారు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం.. పొత్తు ధర్మం అనిపించుకోదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. హరిరామజోగయ్య లేఖలపై జనసేన నేత పంతం నానాజీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఏపీలో టీడీపీ-జనసేన పొత్తులో సీట్ల కేటాయింపు నేతల మధ్య మంట రగిలిస్తోంది. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా టార్గెట్‌గా మరో లేఖాస్త్రం రిలీజ్‌ చేశారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా అని అన్నారు. జనసేన శక్తిని పవన్‌ తక్కువ అంచనా వేసుకుంటున్నారన్నారు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం.. పొత్తు ధర్మం అనిపించుకోదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదన్నారు. జనసేన కార్యకర్తలు రాజ్యాధికారంలో గౌరవ వాటా కోరుకుంటుంటే.. అలా కాదని పవన్ తన శక్తిని తక్కువ అంచనా వేసుకోవడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. పవన్‌ను రెండున్నరేళ్లు సీఎంగా చూడాలనేది జనసేన కార్యకర్తల కోరికన్నారు జోగయ్య.

అయితే.. హరిరామజోగయ్య వరుస లేఖలపై జనసేన నేత, కాకినాడ రూరల్‌ అభ్యర్థి పంతం నానాజీ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. హరిరామజోగయ్య రాజకీయం చేసిన రోజులకు ఇప్పటి పాలిటిక్స్‌కు ఎంతో తేడా ఉందన్నారు పంతం నానాజీ. ఇక.. జనసేన పార్టీ శక్తి ఎంటో తమకు తెలుసని.. దాని ప్రకారమే సీట్లు తీసుకున్నామన్నారు పంతం నానాజీ.. పోటీ చేసే 24 స్థానాల్లోనూ జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పంతం నానాజీ. మొత్తానికి.. టీడీపీ-జనసేన పొత్తులో సీట్ల కేటాయింపు.. పార్టీల్లో కాక రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…