Andhra Pradesh: ఆ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చేది లేదని సీఎం తేల్చిచెప్పారు.. మాజీ మంత్రి వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jagan) అన్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందని, దీన్ని సరి చేసేందుకు...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jagan) అన్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందని, దీన్ని సరి చేసేందుకు గడప గడపకు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్ లు తిరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆదరణ తగ్గిన ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని సీఎం తేల్చి చెప్పారన్నారు. తన రీజనల్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 22 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు కృషి చేస్తానని బాలినేని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లను గెలుచుకోవాలని సీఎం ఆదేశించారని, గతంలో వచ్చిన 151 కంటే ఈసారి కనీసం ఒక్కటైనా అధికంగా సాధించాలన్నదే తమ లక్ష్యమని బాలినేని(Balineni Srinivasulu Reddy) వివరించారు. గతంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ కోల్పోయిన నాలుగు సీట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ధరలు పెంచలేదని, రాష్ట్రాలు వ్యాట్ తరహా ట్యాక్స్‌లు పెంచడం వల్లే ధరలు పెరిగాయని ప్రధాని చెప్పిన విషయంలో వాస్తవం లేదన్నారు. రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా పెట్రోల్ ధరలు తగ్గించడంలో దృష్టి పెట్టాలని మాజీ మంత్రి బాలినేని కోరారు.
పార్టీ పరంగా జరగాల్సినవి, ప్రభుత్వ పరంగా చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యపరిస్తే 175 స్థానాలు ఎందుకు రావని సీఎం జగన్ చెప్పారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మాట అన్నారు. అధ్యక్షులు సుప్రీమ్. పార్టీనే బాస్. ఆ తర్వాతనే మీరు. జిల్లా అధ్యక్షులను మీరు మంత్రులు గౌరవించాలి. మీరు గౌరవిస్తేనే జిల్లా యంత్రాంగం వారికి సహకరిస్తుంది. పార్టీని గెలిపిస్తే జిల్లా అధ్యక్షులే రేపు మంత్రులు అవుతారు. త్వరలోనే వారిని జిల్లా అభివృద్ధి మండళ్లకు ఛైర్మన్లను చేసి, వారికి కేబినెట్ హోదా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Ram Gopal Varma: నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు.. కిచ్చా సుదీప్‌కు సపోర్ట్‌గా ఆర్జీవీ ట్వీట్..
Esha NagiReddi: అమెరికాలో అథ్లెటిక్స్ విభాగంలో సత్తాచాటుతున్న తెలుగు యువతి..