మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు.. సంతాపం తెలిపిన ప్రముఖులు

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య ఈ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లి గ్రామంలో..

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు.. సంతాపం తెలిపిన ప్రముఖులు

Updated on: Jan 15, 2021 | 11:48 AM

Patnam Subbaiah :  మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య ఈ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. సుబ్బయ్య టీడీపీ తరఫున పలమనేరు నియోజకవర్గానికి 1985 నుంచి 1999 వరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా మూడు పర్యాయాలు రాష్ట్ర కేబినెట్‌లో పలు శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు.

అనంతరం 2017లో బీజేపీలో చేరారు. ఆయన మృతికి మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన స్వగ్రామం ఐరాల మండలం కొత్తపల్లిలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

రైతులతో కేంద్రం తొమ్మిదో విడత చర్చలు.. ఇదే చివరిది అంటూ ప్రచారం.. హాజరయ్యేందుకు రైతుల సుముఖత

Australia vs India : ఆస్ట్రేలియాకు షాక్.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు

Bird flu: రోజు రోజుకు విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ.. మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో 382 పక్షులు మృతి