వన్యప్రాణులను పరిరక్షించుకోవాలని చట్టాలు చెబుతున్నా, అటవీ శాఖ అవగాహన కల్పిస్తున్నా.. కొందరు వేటగాళ్లు తమ స్వలాభం కోసం వన్యప్రాణుల ప్రాణాలు తీసేస్తున్నారు. వేటాడి చంపేస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో.. కణుజును చంపి దాని మాంసం విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం ఎరకన్నపాలెం శివారులో వన్యప్రాణి మాంసం విక్రయాలు కలకలం రేపాయి. కణుజు మాంసం విక్రయిస్తుండగా అటవీ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన కోటవురట్ల సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రశాంతకుమారి, బీట్ ఆఫీసర్ నూకరాజు.. ఎరకన్నపాలెం గ్రామ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. చినరాచపల్లి గ్రామానికి చెందిన చింతల సత్తిబాబు, పూడి రమణ వద్ద నుంచి 11 కేజీల కణుజు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. చింతల రమణ అనే వ్యక్తి తమకు సమకూర్చినట్టు నిందితులు చెప్పడంతో రమణను కూడా అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. వన్య ప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ముగ్గురిపై కేసులు నమోదు అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..