
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానంది సమీపంలోని నల్లమల అడవి తరుచు అగ్నిప్రమాదంకి గురి కావడం అందోళన కలిగిస్తుంది. గత నెల రోజుల కాలంలో ఇప్పటికే మూడుసార్లు అడవిలో కార్చిచ్చుకు గురైంది. అసలే వేసవి కాలం వన్యప్రాణులకు దాహాంతో అల్లాడిపోతుండగా మరో ప్రక్క వరుస అగ్ని ప్రమాదాలతో వన్యప్రాణులు విలవిలాడి పోతున్నాయి.
ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆలయం వెనుక వైపున ఉన్న అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆలయం వెనక వైపు ఉన్న నల్లమల అడవిలో మంటలు వేగంగా విస్తరిస్తూ ఉండటం అందోళన కలిగిస్తున్నాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా అడవి మొత్తం విస్తరిస్తూ ఉండటంతో వన్య ప్రాణాలు విలవిలాడి పోయాయి.
నల్లమల అడవిలో చెలరెగుతున్న మంటలతో ఫారెస్ట్, రెవిన్యూ, ఫైర్ అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాలతో మంటలను అదుపు చెయ్యడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అడవిలోకి వెదురు బొంగుల కోసం వెళ్లి వాళ్లు బీడిలు కాల్చి వెయ్యడం వలన మంటలు చెలరెగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఏది ఎమైన అడవిలో వరుస అగ్నిప్రమాదాల నివారణకు ఫారెస్ట్ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.