AP News: అటుగా ఫుడ్ ఆర్డర్ ఉందని వెళ్లాడు.. ఇంట్లో ఎవరూలేరని ఏకాంతంగా.!

|

Mar 06, 2024 | 9:18 AM

మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లిలో నివాసముంటున్న శేఖర్ రెడ్డి అనే వ్యక్తి.. స్థానికంగా ఇటుకల బట్టీని నిర్వహిస్తున్నాడు. తమ ఇంటి తాళాలను కిటికీలో ఉంచి తరచూ ఇటుకల బట్టీకి వెళ్తుండటం అతడికి అలవాటు.

AP News: అటుగా ఫుడ్ ఆర్డర్ ఉందని వెళ్లాడు.. ఇంట్లో ఎవరూలేరని ఏకాంతంగా.!
Representative Image
Follow us on

అన్నమయ్య జిల్లాలో ఫుడ్ డెలివరీ బాయ్ చేతివాటం చూపించాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు ఓ ఇంటికి వెళ్లిన అతడు.. ఎవ్వరూ లేరని చూసుకుని బంగారం, వెండి పట్టుకుని ఉడాయించాడు. మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లిలో నివాసముంటున్న శేఖర్ రెడ్డి అనే వ్యక్తి.. స్థానికంగా ఇటుకల బట్టీని నిర్వహిస్తున్నాడు. తమ ఇంటి తాళాలను కిటికీలో ఉంచి తరచూ ఇటుకల బట్టీకి వెళ్తుండటం అతడికి అలవాటు. ఈ క్రమంలోనే గత నెల 7న ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అతడి ఇంట్లోకి చొరబడి 157 గ్రాముల బంగారు 200 గ్రాముల వెండి, రూ. 52 వేల నగదును అపహరించుకుని వెళ్లారు.

అనంతరం గత నెల 24వ తేదీన తమ ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించిన బాధితుడి తల్లి నారాయణమ్మ.. స్థానికంగా ఉన్న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేయగా.. నిందితుడు నెల్లూరు జిల్లా మునుగోలు మండలం అక్కపేటకు చెందిన 23 ఏళ్ల అజారుద్దీన్‌గా గుర్తించారు. అతడు జొమోటాలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

శేఖర్ రెడ్డి ఇంటి చుట్టుప్రక్కల ఫుడ్ పార్శిల్ సర్వీస్ చేస్తూ వచ్చిన అజారుద్దీన్.. ఆ ఇంటి తాళాలు కిటికీలో పెడుతుండటం గమనించసాగాడు. ఇక ఫిబ్రవరి 7వ తేదీన అటుగా ఫుడ్ డెలివరీకి వచ్చిన నిందితుడు.. శేఖర్ రెడ్డి ఇల్లు తాళం వేసి ఉండటం గమనించి పట్టపగలే చోరీకి పాల్పడ్డాడు. బంగారం, వెండి, నగదుతో పారిపోయాడు. కాగా, సోమవారం తట్టివారిపల్లె దగ్గర బైక్‌పై వెళ్తుండగా.. అజారుద్దీన్‌ను పట్టుకున్నారు పోలీసులు. నిందితుడి నుంచి రూ. 10 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.