Satya Sai District: వేటకు వెళ్లి ఎంతకూ ఇంటికి రాని మత్స్యకారుడు.. చెరువు వద్దకు వెళ్లి చూడగా

చేప పిల్లలకు ఈత ఎవరైనా నేర్పుతారా??? అలాగే మత్స్యకారుడికి చేపల వేట ఎలా చేయాలో ఎవరైనా నేర్పుతారా??? మత్స్యకారుడు అంటేనే నిత్యం నీటిలో వల పట్టుకుని చేపలు వేట చేయడం. అలాంటి జాలరిని తనకు ఇన్నాళ్లు అన్నం పెట్టిన వలే ఉసురు తీసింది. చేపల కోసం వేసిన వలే... ఆ మత్స్యకారుడి పాలిట ఉరితాడు అయింది.

Satya Sai District: వేటకు వెళ్లి ఎంతకూ ఇంటికి రాని మత్స్యకారుడు.. చెరువు వద్దకు వెళ్లి చూడగా
Pond
Follow us
Nalluri Naresh

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 24, 2024 | 9:55 AM

శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని చెరువులో చేపల వేటకు వెళ్లి నాగేశ్వరరావు అనే మత్స్యకారుడు మృతి చెందాడు. చేపల వేట కోసం చెరువులో వేసిన ఉచ్చు లాంటి వలలో మత్స్యకారుడు చిక్కుకున్నాడు. చేపల కోసం వేసిన వల మత్స్యకారుడిని బలి తీసుకుంది. నాగేశ్వరరావు అనే మత్స్యకారుడు చేపల కోసం చెరువులో వల వేసి… ఉచ్చు బిగించి ఒడ్డుకు వచ్చాడు. కాసేపటికి వలలో చేపలు చిక్కాయని… చెరువులోకి దిగిన మత్స్యకారుడు నాగేశ్వరరావు కాళ్లకు… తాను వేసిన వలే.. చుట్టుకుని చిక్కుకుంది… దీంతో అతను ఈత కొట్టలేక… వల చిక్కుముడి విడిపించుకోలేక…. ఊపిరాడక మత్స్యకారుడు నాగేశ్వరావు చెరువులోనే మృతి చెందాడు.

చేపల వేటకు అని వెళ్లిన నాగేశ్వరరావు సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో… చెరువు దగ్గరకు వెళ్లిన కుమారుడికి… చెరువు ఒడ్డున తండ్రి నాగేశ్వరావుకు సంబంధించిన వస్తువులు కనిపించాయి. దీంతో కుమారుడు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చి… చెరువులో గాలింపు చేపట్టారు. కాసేపటికి నాగేశ్వరరావు మృతదేహం చెరువులో దొరికింది. అయితే మత్స్యకారుడు నాగేశ్వరావు కాళ్లకు చేపల కోసం వేసిన వల చుట్టుకోవడంతో… ఈత కొట్టలేక చెరువులో మునిగి మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. విధి ఎంత విచిత్రమైనది అంటే… నిత్యం చేపల వేటకు వెళ్లి… అదే పని చేసుకుంటూ జీవనం సాగించే మత్స్యకారుడిని…. అదే వృత్తి మృత్యువు రూపంలో కబలించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్