Konaseema: ఓర్నీ.. వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇలా పట్టొచ్చా.. కోనసీమ కుర్రాళ్లా.. మజాకా

మాటల్లో వెటకారం.. చేతల్లో మమకారం మాత్రమే కాదు.. చేసే పనుల్లో తెలివితేటలు సైతం కోనసీమ వాళ్ల సొంతం. చేపలు పట్టడంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టి భలేగా డబ్బు సంపాదిస్తున్నారు ఇక్కడి కుర్రాళ్లు. ఇంతకీ వారి టెక్నిక్ ఏంటి..? ఒక్కొక్క చేప ఎంతకు విక్రయిస్తున్నారు లాంటి డీటేల్స్ తెలుసుకుందాం...

Konaseema: ఓర్నీ.. వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇలా పట్టొచ్చా.. కోనసీమ కుర్రాళ్లా.. మజాకా
Fishing
Follow us
Pvv Satyanarayana

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 24, 2024 | 12:47 PM

సాధారణంగా చేపటలు పట్టాలంటే చెరువులో గాలం వేస్తారు..లేదా వల వేస్తారు. కానీ వాటర్‌ బాటిల్‌లో చేపలు పట్టడం ఎప్పుడైనా చూశారా? ఇలాంటి ప్రయోగాలు చేయడంలో భారతీయులను మించిన వారుండరు. చదువుతో పనిలేకుండా అద్భుతమైన ప్రతిభను చాటే ఎందరో మట్టిలో మాణిక్యాలు భారతదేశం సొంతం. సోషల్‌ మీడియా పుణ్యమా అని అలాంటి ఆణిముత్యాలు ఇటీవల వెలుగులోకి వస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇక ఇలాంటి ఐడియాలు వెయ్యాలంటే కోనసీమ కుర్రాళ్ల తర్వాతే ఎవరైనా..తాజాగా ఈ కోనసీమ కుర్రాళ్లు చేపలను ఎంతో ఈజీగా పట్టేసే టెక్నిక్‌ కనిపెట్టారు. వలవేయకుండానే పెద్ద పెద్ద చేపలను టక టకాపట్టేస్తున్న వీరిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కోనసీమ కుర్రాళ్లా మజాకా అంటున్నారు!

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం యువకులు చేపలు పట్టడంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. వలతో పనిలేకుండా ఎంతో సులువుగా చేపలు పట్టేస్తూ చకచకా అమ్మేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. వల లేకుండా చేపలు ఎలా పడుతున్నారనుకుంటున్నారు కదా.. ఇదిగో ఇలా.. ఓ రెండు లీటర్ల వాటర్ బాటిల్ కు తాడు కట్టి బాటిల్ లో మైదా పిండి పెట్టి గోదావరి లో కి బాటిల్ ను విసురుతున్నారు. అంతే ఆహారం కోసం వచ్చిన చేపలు ఆ బాటిల్‌లోకి వెళ్ళగానే చకచకా బయటకు లాగేస్తున్నారు. ఏకంగా కిలో, రెండు కిలోల బరువుండే చేపలు బాటిల్‌కి చిక్కుతున్నాయి. దీంతో యువకుల ఆనందాన్నికి అవధులు లేకుండా పోయాయి. ఇలా లైవ్ లో వచ్చిన చేపలను కొనడానికి యానాం పరిసర ప్రాంతాల్లో ఉన్న మాంస ప్రియులు క్యూకడుతున్నారు. యువకులు చేపలు పట్టే విధానం చూసి ఫిదా అయిపోతున్నారు. ఇక ఒక్కొక్క చేప 500 నుంచి 600 వందలకు విక్రయిస్తూ యువకులు డబ్బులు సంపాదిస్తున్నారు. వాటర్‌ బాటిల్‌తో చేపలు పట్టడం స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చేపల వేటను వీక్షించేందుకు గోదావరి వద్దకు స్థానికులు, చేపల కొనగోలుదారులు, సందర్శకులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో గోదారిగడ్డు సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ఇన్నాళ్లూ వలలతోనానా తంటాలు పడ్డాం కదరా.. అంటూ కొందరు మత్స్యకారులు సైతం ఆశ్చర్యపోయారు. యువకుల తెలివికి ప్రశంసించారు.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు