AP News: సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఊహించని సీన్.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

| Edited By: Ravi Kiran

Aug 09, 2024 | 9:23 AM

మత్స్యకారులకు వేటే జీవనధారం. లక్షలు పెట్టి బోట్లు తయారు చేయించి.. దాన్నే దైవంగా భావించి వేట సాగిస్తూ ఉంటారు. అటువంటి బోటుకు ఏదైనా సమస్య తలెత్తితే ఆ మత్స్యకారుల ఆవేదన అంతా ఇంతా కాదు. నడి సంద్రమైనా సరే..

AP News: సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఊహించని సీన్.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
Viral Video
Follow us on

మత్స్యకారులకు వేటే జీవనధారం. లక్షలు పెట్టి బోట్లు తయారు చేయించి.. దాన్నే దైవంగా భావించి వేట సాగిస్తూ ఉంటారు. అటువంటి బోటుకు ఏదైనా సమస్య తలెత్తితే ఆ మత్స్యకారుల ఆవేదన అంతా ఇంతా కాదు. నడి సంద్రమైనా సరే.. తమ ప్రాణాలను పణంగా పెట్టెందుకు వెనుకాడరు గంగ పుత్రులు. అటువంటి ఘటనే విశాఖ తీరానికి సమీపంలో జరిగింది. ఆ బోటును రక్షించి ఒడ్డుకు తీసుకొద్దామనే చివరి వరకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అయినప్పటికి మునిగిపోయే స్థితిలో ఉన్న ఆ మరబోటును ఒడ్డుకు తేవాలనే ఆ ప్రయత్నం చివరకు ఫలించలేదు. ఇంజిన్ ఫెయిలై బోటు ఆర్కే బీచ్ వైపు వచ్చి.. కెరటాల్లో సగం వరకు మునిగిపోయింది. అయితే అందులో ఉన్న మత్స్యకారులను మరో బోటులో వెళ్లి కాపాడారు. తమకు జీవనధారమైన బోటు మునిగిపోవాడంతో ఆ గంగపుత్రులు కన్నీటి ఆవేదన అంతా ఇంతా కాదు.

విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో మర బోటు మునిగిపోయింది. వేట చేసి తిరిగి వస్తుండగా బోటుకు ఇంజన్ ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగిగింది. అంతా చూస్తూ ఉండగానే మారబోటు ఒద్దువైపు కొట్టుకోస్తూ కళ్ళముందే మునిగిపో్యుంది. జెట్టికి మైలు దూరంలో ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. యాంకర్ వేసి నిలబెడదామని చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. తాడు తెగిపోయి ఆ బోటు.. పట్టు తప్పి ఒడ్డు వైపు కెరటాల తాకడికి వెళ్ళిపోతుంది. దీంతో సమాచారం అందుకున్న మారికింత మంది.. మరో బోటులో వెళ్లి బోటును తిరిగి సముద్రంలో యాంకరింగ్ చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా శ్రమించ్చారు. అయినా కెరటాలు, గాలి తాకడికి నిలవలేదు. దీంతో ఇక.. ఆ బోటులో ఉన్న వారినీ రెస్క్యూ చేశారు మత్స్యకారులు. అయితే బోటు యజమాని మాత్రం అందులోనే ఉంటూ బోటును సేఫ్ గా ఒడ్డుకు తెచ్చేందుకు చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం ఫలించలేదు. అలా అలా గాలి వాటానికి ఆర్కే బీచ్ వైపు వచ్చిన బోటును సందర్శకులు చూస్తూ ఉండిపోయారు. కళ్ళముందే ఆ బోటు మెల్లమెల్లగా నీటిలో మునిగిపోయింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. బోటు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నరు ఫిషరీస్ అధికారులు.

‘ఐఎన్-ఎపి-ఎంఎం-వి529 నెంబరు గల బోటు అయిదుగురు మత్స్యకారులతో చేపలవేటకు గురువారం తెల్లవారు జామున వెళ్లింది. వేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఇంజను ఫెయిలై బోటు ప్రమాదంలో చిక్కుకుంది. బోటు వెనక్కి తేవడం క్లిష్టంగా మారింది. బోటులో ఉన్న వాసుపల్లి రాజు, అప్పన్న, లక్ష్మయ్య, రాజు, ప్రవతీయలను ఆర్కే బీచ్ లైఫ్ గార్డులు, మెరైన్ పోలీసుల సహాయంతో అతికష్టం మీద రెస్క్యు చేశారు’ అని అన్నారు మత్స్యశాఖ జేడీ విజయ

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..