
అర్థరాత్రి వేళ విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు ఇళ్లు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. చీపురుపల్లి రుంకానవీధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం ప్రాణ నష్టం తప్పింది. కాగా, భారీగా మంటలు ఎగిసిపడటంలో.. చుట్టుపక్కల భయానక వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుంది. శ్రమపడి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..