Eluru: నువ్వంటే నాకిష్టం.. నీతో ఉండాలనిపిస్తుంది.. మహిళా వాలంటీర్ పై సర్పంచ్ భర్త వేధింపులు

|

Apr 20, 2022 | 5:54 PM

ప్రస్తుత రోజుల్లో మహిళలపై వేధింపులు, దాడులు, అత్యాచారాలు(Harassment) నిత్యకృతమయ్యాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఆడవాళ్లపై వేధింపులు....

Eluru: నువ్వంటే నాకిష్టం.. నీతో ఉండాలనిపిస్తుంది.. మహిళా వాలంటీర్ పై సర్పంచ్ భర్త వేధింపులు
Follow us on

ప్రస్తుత రోజుల్లో మహిళలపై వేధింపులు, దాడులు, అత్యాచారాలు(Harassment) నిత్యకృతమయ్యాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఆడవాళ్లపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే.. ఈ దాడులను ఎదుర్కోవాల్సిన అధికారులు సైతం ఇలాంటి వేధింపులకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలకు సేవ చేసే హోదాలో ఉన్నవారినీ నీచులు వదలడం లేదు. అంతే కాకుండా అధికార దర్పంతో కొందరు ఈ నేరాలకు పాల్పడుతున్నారు. తాము అధికారంలో ఉన్నామని, ఎవరూ ఏమీ చేయలేరన్న దర్పంతో దాడులకు తెగబడుతున్నారు. తమ స్థాయి గౌరవాన్ని మర్చిపోయి, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. తమ స్థాయి ఓ సర్పంచ్ భర్త మహిళా వాలంటీర్ ను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న షాకింగ్ ఘటన తాజాగా వెలుగు చూసింది. బాధితురాలు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని రమణక్కపేటలో ఓ మహిళ మూడేళ్ల నుంచి వాలంటీర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ భర్త రంగు గాంధీ తనను మానసికంగా వేధిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విధులు నిర్వహించే సమయంలో మానసికంగా వేధిస్తున్నట్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని, నువ్వంటే నాకిష్టం… నీతో ఉండాలనిపిస్తుంది అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా ఫోను బలవంతంగా తీసుకున్నారని వాపోయారు. సర్పంచ్ భర్త వేధింపులు తాళలేక ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ లకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Also Read

Viral Video: ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి !! అన్యోన్యంగా యాపిల్‌ పంచుకుంటున్న మూగజీవులు

Eatala Rajender: టీఆర్ఎస్ దౌర్జన్యాలపై సీబీఐ విచారణ జరపాలి.. సాయి గణేష్ కుటుంబానికి ఈటల పరామర్శ..

SAMEER Recruitment 2022: నెలకు రూ.30,000లజీతంతో సమీర్‌లో రీసెర్చ్‌ సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..