Farmer Land Issue: వివాదంగా మారిన రహదారి.. పోలీసుల సాయంతో పంట చేలను దున్నుతున్న వీడియో వైరల్

Farmer Land Issue: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో ఒక పొలంలో రస్తా అంశం వివాదస్పందంగా మారింది. గ్రామానికి చెందిన..

Farmer Land Issue: వివాదంగా మారిన రహదారి.. పోలీసుల సాయంతో పంట చేలను దున్నుతున్న వీడియో వైరల్
Farmer Land Issue

Updated on: Oct 23, 2021 | 11:23 AM

Farmer Land Issue: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో ఒక పొలంలో రహదారి  అంశం వివాదస్పందంగా మారింది. గ్రామానికి చెందిన నాగలింగారెడ్డికి పక్క పొలం వారికి రోడ్డు విషయంలో వివాదం ఉంది.  రహదారిలో పొలాన్ని ఆక్రమించి పొలం వేశారన్నది వివాదం. దీనిపై రెవెన్యూ అధికారులు పలుసార్లు విచారణ చేపట్టి.. ఇది  రోడ్డు అని తేల్చారు. ఈనేపథ్యంలో పలుసార్ల నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో పొలాన్ని దున్నే కార్యక్రమం చేపట్టారు. అయితే తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తమ పొలాన్ని దున్నేస్తున్నారంటూ రైతు కుటుంబసభ్యులు అడ్డుపడ్డారు.

పోలీసుల సాయంతో పొలం దున్నుతున్న సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. తాము ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామని.. ఇప్పుడు అన్యాయంగా ఈ పొలాన్ని తొలగిస్తున్నారని రైతు కుటుంబం ఆరోపిస్తోంది. ఇదంతా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు చేయిస్తున్నారి ఆరోపించారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఇది రికార్డ్స్ ప్రకారం రస్తానేనని… ఈవిషయం వారికి ముందే చెప్పామంటున్నారు.

 

Also Read:  మనదేశంలో చీమల చట్నీ, ఐస్ క్రీమ్, ఉసుళ్ల వేపుడు, పురుగుల పచ్చడి ఫేమస్ ఎక్కడంటే..