అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఆ రైతు. వజ్రం రూపంలో అతడిని అదృష్టం వరించడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. కర్నూలు జిల్లా చిన్నజోన్నగిరి ప్రాంతానికి చెందిన ఓ రైతు గురువారం పొలం పనులు చేసుకుంటుండగా.. అతడికి విలువైన వజ్రం లభించింది.
ఈ విషయం తెలుసుకున్న వజ్రాల వ్యాపారాలు ఆ అన్నదాత ఇంటికి క్యూ కట్టారు. ఇక దాన్ని సీక్రెట్‌గా వేలం వేయగా.. గుత్తికి చెందిన వ్యాపారి ఒకరు రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మార్కెట్‌లో ఆ వజ్రం ధర ఏకంగా రూ. 3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
కాగా, గతంలోనూ జొన్నగిరికి చెందిన వ్యక్తికి రూ. 37 లక్షల విలువైన వజ్రం లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా తొలకరి జల్లులకు ఈ ప్రాంతంలో చిన్నా, పెద్ద వజ్రాలు దొరుకుతాయని స్థానిక ప్రజలు చెబుతుంటారు. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో అక్కడి ప్రజలు వజ్రాల కోసం వెతుకుతూనే ఉంటారు.
Also Read:
మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?
టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?
సర్కస్ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!