AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో ఎంత ఘోరం.. ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన సరదా..!

కడపలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెలవులలో ఆనందంగా గడపడానికి అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈతకు వెళ్ళి ఐదుగురు బాలురు మృతి చెందారు. చెరువులో ఈతకు వెళ్లి గుంటలో ఇరుక్కుని బయటకు రాలేక ఊపిరి ఆడక నానా యాతన పడి ఊపిరి వదిలారు. అందరు కలిసికట్టుగా ఒకే గుంటలో ఇరుక్కుని ప్రాణాలు వదిలారు.

అయ్యో ఎంత ఘోరం.. ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన సరదా..!
Lake
Sudhir Chappidi
| Edited By: |

Updated on: May 14, 2025 | 7:18 AM

Share

కడపలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెలవులలో ఆనందంగా గడపడానికి అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈతకు వెళ్ళి ఐదుగురు బాలురు మృతి చెందారు. చెరువులో ఈతకు వెళ్లి గుంటలో ఇరుక్కుని బయటకు రాలేక ఊపిరి ఆడక నానా యాతన పడి ఊపిరి వదిలారు. అందరు కలిసికట్టుగా ఒకే గుంటలో ఇరుక్కుని ప్రాణాలు వదిలారు.

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సెలవులపై అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మల్లేపల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు. సాయంత్రం అయినా బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. గ్రామంలో వెతుకుతుండగా పిల్లల బట్టలు, చెప్పులు చెరువు ఒడ్డున కనిపించాయి. దీంతో గ్రామస్తులంతా చెరువు వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లతో చెరువులో పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు పిల్లల ఆనవాళ్ళు తెలియలేదు. రాత్రి అయినా పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజఈతగాళ్లు ఆపకుండా వెతకడంతో పిల్లలంతా ఒకే చోట విగత జీవులై కనిపించారు. వీరంతా అక్క, చెల్లెలు, అన్న పిల్లలుగా గుర్తించారు. చనిపోయిన బాలురంతా 15 సంవత్సరాలలోపు వారే కావడంతో విశేషం. ఇందులో ఆళ్ళగడ్డకు చెందిన చరణ్, పార్దు ఇద్దరూ అన్నదమ్ములు ఒకే తల్లి పిలలు. వీరిద్దరు చనిపోవడంతో ఆ కుటుంబం మరింత శోకసంద్రంలో మునిగిపోయింది.

హర్ష జమ్మలమడుగుకు చెందిన బాలుడు కాగా, దీక్షిత్ మల్లెపల్లికి చెందిన బాలుడు, తరుణ్ అదే మండలంలోని నల్లారు కొట్టాలకు చెందిన బాలుడు. మల్లెపల్లి చెరువులో మట్టి కోసం తవ్విన గుంతలోనే వీరి మృతదేహాలు లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల తవ్విన గుంత లోతు ఎంతో తెలియక ఈతకు వెళ్లిన ఈ ఐదుగురు బాలురు చనిపోయి ఉంటారని స్థానికులు అంటున్నారు. ఆనందంగా ఆహ్లాదంగా గడపాల్సిన పిల్లలు ఈతకు వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్