Krishna District: కాలం బాలేదు.. ఫీట్లు చేస్తే కానీ కడుపు నిండటం లేదు..
మస్త్ ఎండాకాలం నడుస్తోంది. రోడ్ల వెంట పరక కూడా దొరకడం లేదు. దీంతో మేకలు, గొర్రెలు అల్లాడిపోతున్నాయి. వాటి ఆకలి బాధకు అద్దం పట్టే దృశ్యం ఇది. ఒక పెద్ద చెట్టు ఆకులు తినేందుకు ఇదిగో ఈ మేక ఇలా బైక్ ఎక్కి ఫీట్లు చేసింది.
ప్రస్తుతం పీక్ సమ్మర్ నడుస్తోంది. దీంతో జీవాలకు మేత కరువైపోయింది. గొర్రెలు, మేకలు మేత దొరక్క అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో ఓ ఆసక్తికర దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. మేక తన కడుపు నింపుకోవడానికి ఫీట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. వేసవి కాలం కావటంతో రోడ్ల వెంబడి జీవాలకు గడ్డి, పచ్చిక దొరకడం లేదు. దీంతో.. ఓ ఎత్తైన చెట్ల ఆకులు తినేందుకు ఈ మేక ఫీట్లు చేసింది. ద్విచక్ర వాహనం హ్యాండిల్ వరకు పైకి ఎక్కి చెట్టు ఆకులతో కడుపు నింపుకుంది. గుడివాడ పట్టణంలోని ఏలూరు రోడ్డులో మేక ఈ విధంగా తన కడుపు నింపుకుంటున్న దృశ్యాలు వైరల్‌గా మారింది. ఆకలి ఎలాంటి ఫీట్లు అయినా చేయిస్తుంది.. ఎన్ని పాట్లు అయినా పడేలా చేస్తుంది అని కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

