Nirmal: చేప కోసం వేసిన గాలం ఎంత గుంజినా పైకి రావడంలే.. నలుగురు కలసి బలంగా లాగగా..
గాలానికి 2, 3 కేజీల చేపల.. మహా అయితే 5 కేజీల చేపలు చిక్కడం మీరు చూసి ఉంటారు. కానీ గాలానికి 30 కేజీల చేప చిక్కింది అంటే మీరు నమ్ముతారా..? కష్టమే కదా.. అందుకే మీ డౌట్ క్లారిఫై చేసేందుకు అందుకు సంబంధించిన వీడియో కూడా తీసుకొచ్చాం.
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గాంధీనగర్ ప్రాంతంలో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేటకు స్థానికంగా ఉండే కొందరు మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఈ క్రమంలో గాలం వేయగా.. చేప చిక్కినట్లు అనిపించింది. అయితే ఎంత లాగినా గాలం పైకి రావడం లేదు. దీంతో నలుగురు జతకూడి బలంగా బయటకు లాగగా.. ఏకంగా 30 కేజీల భారీ చేప చిక్కింది. అందరూ కలిసినా ఆ చేపను బయటకు లాగేందుకు అష్టకష్టాలు పడ్డారు. గాలానికి ఇంత భారీ చేప చిక్కడం చాలా అరుదని చెబుతున్నారు. భారీ చేప చిక్కిందని సంబరపడుతున్నారు. కాగా ఇది బొచ్చ చేప అని వారు చెబుతున్నారు. మార్కెట్ లో దీని ధర కేజీ 250 రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: May 14, 2025 09:52 AM
వైరల్ వీడియోలు

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ
Latest Videos