
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ఆమెతో పాటు నారా బ్రాహ్మణి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ఆరోగ్యం పైన ఆరా తీసారు. రాజకీయంగా అమలు చేయాల్సిన కార్యాచరణ పైన యనమలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. లోకేశ్ ఢిల్లీలో ఉండటంతో బ్రాహ్మణి అక్కడే భువనేశ్వరితో పాటుగా ఉంటున్నారు. ఇవాళ జైలులో చంద్రబాబుతో ఆ ఇద్దరు యనమలతో కలిసి భేటీ అయ్యారు.అంతకుముందు రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి టెంపుల్‌లో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..