గ్రామ వాలంటీర్లమంటూ వచ్చి..అకౌంట్లలో సొమ్మంతా నొక్కేశారు!

|

Aug 21, 2019 | 6:20 AM

గ్రామాల్లో అమాయకులైన జానాల్ని టార్గెట్‌గా చేసుకోని కొంతమంది ఛీటర్స్ రెచ్చిపోతున్నారు. అందివచ్చిన మార్గాల్లో సొమ్ము దోచుకోని ఉడాయిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలో చోటుచేసుకుంది.  గ్రామ వాలంటీర్లమంటూ వచ్చి.. వివరాలు నమోదు చేసుకున్నారు. ఫింగర్ ఫ్రింట్స్, బ్యాంకు అకౌంట్ డీటెల్స్ అడిగి..అవి చెప్పక పోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారని బెదిరించారు. అమాయక ప్రజలు ఆ వలలో చిక్కారు. వారు అడిగినట్టుగానే అన్ని వివరాలు ఇచ్చారు. ఆ తర్వాత మొబైల్​కు వచ్చిన మెసేజ్ […]

గ్రామ వాలంటీర్లమంటూ వచ్చి..అకౌంట్లలో సొమ్మంతా నొక్కేశారు!
Fake grama Volunteers
Follow us on

గ్రామాల్లో అమాయకులైన జానాల్ని టార్గెట్‌గా చేసుకోని కొంతమంది ఛీటర్స్ రెచ్చిపోతున్నారు. అందివచ్చిన మార్గాల్లో సొమ్ము దోచుకోని ఉడాయిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలో చోటుచేసుకుంది.  గ్రామ వాలంటీర్లమంటూ వచ్చి.. వివరాలు నమోదు చేసుకున్నారు. ఫింగర్ ఫ్రింట్స్, బ్యాంకు అకౌంట్ డీటెల్స్ అడిగి..అవి చెప్పక పోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారని బెదిరించారు. అమాయక ప్రజలు ఆ వలలో చిక్కారు. వారు అడిగినట్టుగానే అన్ని వివరాలు ఇచ్చారు.

ఆ తర్వాత మొబైల్​కు వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యారు. తీరా చూస్తే.. వారి అకౌంట్​లోంచి నగదు మాయమైంది. లబోదిబో మంటూ బ్యాంకుకెళితే.. అధికారుల ద్వారా మోసపొయ్యామని తెలుసుకున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.