AP News: శ్రీకాకుళం జిల్లాలో ఓ క్రేజీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున కరెన్సీ నోట్లు గాల్లో కుప్పులు తెప్పులగా ఎగిరొచ్చాయి. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తేరుకుని గాల్లో నుంచి ఎగిరొచ్చిన లక్ష్మీ దేవిని సొంతం చేసుకునేందుకు పోటీపట్డారు. దొరికిన నోట్లను దొరికినట్లు జేబుల్లో కుక్కేశారు. నగరంలోని కొత్త వంతెనపై ఈ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. వాహనాలు ఎక్కడబడితే అక్కడ నిలిపేయండతో.. ట్రాఫిక్‌కు చాలాసేపు అంతరాయం ఏర్పడింది. దీంతో .. ఆఫీసులకు వెళ్తున్నవారు, ఎమెర్జెన్సీ పనులు మీద వెళ్తున్నవారు ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి.. అసలు విషయం గురించి ఆరా తీశారు. అప్పుడు.. అసలు ట్విస్ట్ రివీలయ్యింది. మేటర్ ఏంటంటే గాల్లో ఎగిరొచ్చిన నోట్లన్నీ ఫేక్..! ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఈ నకిలీ నోట్లను పడేయడంతో.. అవి గాలి వాటానికి ఎగిరి అటుగా వచ్చాయి. ఈ విషయం తెలియని జనం.. కరెన్సీ నోట్లు కనిపించగానే దక్కించుకునేందుకు పోటీపడ్డారు. అసలు విషయం తెలియడంతో ఉసూరుమన్నారు. డబ్బులు దొరికాయనే వారి ఉత్సాహం ఎక్కువ సేపు నిలవకుండా పోయింది. తమ పంట పండిందని.. అనుకుని ఆ నోట్లను ఎత్తుకున్న వారంతా.. నిజం తెలిసి.. వాటిని అక్కడే పడేని నిరాశతో ఇళ్ల బాట పట్టారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..