Andhra Pradesh: ఏపీలోని ఆ జిల్లాలో మినీ లాక్‌డౌన్.? నెట్టింట వైరల్.. జగన్ సర్కార్ క్లారిటీ..

|

Dec 29, 2022 | 2:55 PM

అసలే కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కలవరపాటుకు గురి చేస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో కోవిడ్‌కు సంబంధించిన ఫేక్ న్యూస్‌లు..

Andhra Pradesh: ఏపీలోని ఆ జిల్లాలో మినీ లాక్‌డౌన్.? నెట్టింట వైరల్.. జగన్ సర్కార్ క్లారిటీ..
Ap Corona
Follow us on

అసలే కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కలవరపాటుకు గురి చేస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో కోవిడ్‌కు సంబంధించిన ఫేక్ న్యూస్‌లు ప్రజల్లో మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో ఇంటర్నెట్ వేదికగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మినీ లాక్‌డౌన్ విధించారని.. తిరుపతిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారని’ ఆ వీడియో సారాంశం. ఇది సోషల్ మీడియాతో పాటు వాట్సాప్ గ్రూప్‌లలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక తాజాగా దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది.

ఆ వీడియో 2021 ఏప్రిల్ నెలకు సంబంధించినది అని క్లారిటీ ఇచ్చింది. సదరు వీడియో ప్రస్తుతం పలు వాట్సాప్ గ్రూప్‌లు, ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ ప్రజల్లో మరింత భయాన్ని సృష్టిస్తోందని చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్ లేదా కరోనా అలెర్ట్‌కు సంబంధించిన వార్తలు ఏవైనా ఉంటే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే ఏ వీడియోను నమ్మొద్దు.. ఎవరైనా కూడా ఇలాంటి వీడియోలు ఫార్వర్డ్ చేసే ముందు ఆ సమాచారాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.