YS Bharathi Reddy Letter: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఫేస్‌బుక్, వాట్సప్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ముఖ్యంగా నకిలీ వార్తలు ఎక్కువగా షేర్ అవుతుంటాయి. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఏపీ ప్రజలకు లేఖ రాసినట్లు వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. అసలు ఇది నిజమేనా.. లేక నకిలీ వార్తనా అనేదానిపై వైఎస్ఆర్‌సీపీ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైఎస్ భారతి గారి పేరు మీద సర్క్యులేట్ అవుతున్న ఉత్తరం నకిలీ ఉత్తరం అంటూ వైసీపీ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఆ ఉత్తరం భారతి రాసినది కాదని.. ఈ విషయం అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
వైఎస్ భారతి పేరుతో వైరల్ అవుతున్న నకిలీ ఉత్తరంలో ఏముందంటే..?
‘‘ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, వైస్సార్సీపీ అభిమానులకు నా మనసులోని భావాలు, ఆందోళన, భయాలు చెప్పటానికి మొదటి సారి మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చినది. పొలిటికల్, పర్సనల్ గా ఎవరిని కామెంట్ చెయ్యటం నా ఉద్దేశ్యం కాదు. వైస్ జగన్ గెలిస్తే ఎవరికీ ఏమి చేస్తాడు అని చెప్పటానికి రాలేదు. ఎవరు ఏ పథకాలను అమలుచేసిన అది వాళ్ళ అబ్బ సొత్తు కాదు మీ సొమ్ము మీకే ఇస్తున్నారు, కానీ నాయకుడు సమ న్యాయం, దూరదృష్టి, ఫలాలు అందరికి అందేలా చెయ్యాలి.’’ అంటూ వైఎస్ భారతి పేరు మీద ఒక నకిలీ వార్త ( నకిలీ ఉత్తరం) వాట్సప్ గ్రూపులల్లో సర్క్యూలేట్ అవుతోంది. కావున ఇలాంటి ఉత్తరాలు, వార్తలను ఒకటికి రెండు సార్లు నిజమా..? కాదా..? అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: