Tirupati Rain: తిరుపతిలో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. నీళ్లలో నిల్చిపోయిన వాహనంలో ఇరుక్కుపోయి ఊపిరాడక యువతి మృతి

| Edited By: Anil kumar poka

Oct 23, 2021 | 1:32 PM

రాయలసీమలో భారీ వర్షాలు కురిస్తాయని వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్రలో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి.

Tirupati Rain: తిరుపతిలో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. నీళ్లలో నిల్చిపోయిన వాహనంలో ఇరుక్కుపోయి ఊపిరాడక యువతి మృతి
Rains
Follow us on

Rayalaseema – Andhra Weather Report: రాయలసీమలో భారీ వర్షాలు కురిస్తాయని వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్రలో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈశాన్య రుతుపవనా ప్రవేశంతో తీవ్ర అనిశ్చితి ఏర్పడి.. వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక, తిరుపతిలో అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులు కురిసిన భారీ వర్షానికి వెస్ట్ చర్చి వద్ద నీటి ప్రవాహం పెరిగింది. ఈ వరదలో వాహనం ఇరుక్కుపోయింది.

ల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీటి ఉధృతి పెరగడంతో కర్ణాటకకు చెందిన పెళ్ళిబృందం ప్రయాణిస్తున్న వాహనం నీళ్లలోనే నిలిచిపోయింది. దీంతో వాహనంలో ఊపిరి ఆడక సంధ్య అనే యువతి మృతి చెందింది. నీటి ప్రవాహాన్ని గమనించకుండా వెళ్లి వాహనం ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని రాయచూరు కు చెందిన పెళ్లి బృందం వాహనంగా గుర్తించారు. వాహనంలో ఉన్న ఏడుగురిలో సంధ్య అనే యువతి ఊపిరి ఆడక మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిన రుయా ఆస్పత్రికి తరలించారు.

Read also:  AP Politics: హస్తినకు ఏపీ పంచాయితీ.. ఎల్లుండి మోదీ, అమిత్‌షాతో భేటికి చంద్రబాబు యత్నం