YS Jagan – Kadapa Tour: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు, రేపు కడప జిల్లాలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం3 గంటలకు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి ఇడుపులపాయకు జగన్ బయలుదేరనున్నారు. 3.30pmకి గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కడప వెళతారు. 4.50pm ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్‌ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు.
ఇక, రేపు (02.09.2021) సీఎం వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడి తిరుగుపయనం చేస్తారు. ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం.
ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది డీఎస్పీ (సివిల్)లకు అదనపు ఎస్పీ (సివిల్)లుగా జగన్ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఈ డీఎస్పీల పదోన్నతుల అంశం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 40 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై కోర్టులో లేదా ట్రిబ్యునల్‌లో ఏవైనా కేసులు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై తీర్పుకు లోబడి ఈ ఉత్తర్వులు అమలు చేస్తామని పేర్కొన్నారు.
Read also: Maharashtra: భారీ వర్షాలకు ఇద్దరు మృతి.. వరదల కారణంగా అనేక మంది అదృశ్యం