Nellore: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా చాక్లెట్స్.. ఎగబడ్డ జనం.. చివర్లో ఊహించని ట్విస్ట్

|

Jul 31, 2021 | 10:30 AM

నెల్లూరు రోడ్డుపై చాక్‌లెట్స్‌ కలకలం రేపాయి. ఏసీ నగర్‌లో రోడ్డుపై చాక్‌లెట్స్, ప్రోటీన్‌ ప్రొడక్ట్స్‌ పడేశారు. దీంతో వాటిని తీసుకునేందుకు...

Nellore: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా చాక్లెట్స్.. ఎగబడ్డ జనం.. చివర్లో ఊహించని ట్విస్ట్
Chocolates In Nellore
Follow us on

నెల్లూరు రోడ్డుపై చాక్లెట్స్ కలకలం రేపాయి. ఏసీ నగర్‌లో రోడ్డుపై చాక్లెట్స్, ప్రోటీన్‌ ప్రొడక్ట్స్‌ కుప్పులు తెప్పలుగా కనిపించాయి. లోడ్ తీసుకెళ్తుండగా పడిపోయాయని అందరూ భావించారు. దీంతో వాటిని తీసుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. చేతికందినన్ని తీసుకున్నారు. కొందరైతే సంచుల్లో నింపుకున్నారు. చిన్న పిల్లలయితే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరకుని వాటిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే అవి ఎక్స్‌పైరీ అయిన చాక్‌లెట్స్ అని తర్వాత తెలిసింది. డేట్ ముగిసిపోవడంతో గోదాం నుంచి తీసుకొచ్చి నడి రోడ్డుపై ఈవిధంగా పడేసి వెళ్లారు. ఆ విషయం  తెలియడంతో కొందరు వాటిని తిరిగి అక్కడే పడేశారు.కాలం చెల్లిన చాక్లెట్లు కావడంతో మున్సిపల్‌ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వాటిని ఎవరూ తినవద్దని, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

 

 నేలబావిలో జారిపడి ఇద్దరు బాలికలు మృతి

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బొడ్డగూడ వద్ద విషాదం చోటుచేసుకుంది. బొడ్డగూడ వద్ద ఇద్దరు బాలికలు నేలబావిలో పడి మృతిచెందారు. గ్రామానికి చెందిన బాలికలు ఇద్దరు కీర్తి, అంజలి.. తాగునీటి కోసం స్థానిక కోటకొండ దగ్గర్లోని నేలబావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో జారిపడి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలికలు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

Also Read:Viral Video: కొండచిలువను పట్టి కరకరా నమిలి మింగేసిన మొసలి.. చూస్తే షాకవుతారు

Noni fruit: ఈ అద్భుత ఫలం 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేయగలదు..