Srisailam Reservoir: శ్రీశైలం రిజర్వాయర్‌కు పెనుముప్పు.. నిపుణుల కమిటీ వార్నింగ్.. ఇంకా..

|

Apr 21, 2022 | 8:34 AM

Expert Commission Warning to Srisailam Dam: దేశంలోని అతి ముఖ్యమైన రిజర్వాయర్లలో ఒకటేనా శ్రీశైలం డ్యామ్ కు ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ AB పాండ్యా కమిటీ హెచ్చరించింది.

Srisailam Reservoir: శ్రీశైలం రిజర్వాయర్‌కు పెనుముప్పు.. నిపుణుల కమిటీ వార్నింగ్.. ఇంకా..
Srisailam
Follow us on

Expert Commission Warning to Srisailam Dam: దేశంలోని అతి ముఖ్యమైన రిజర్వాయర్లలో ఒకటేనా శ్రీశైలం డ్యామ్ కు ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ AB పాండ్యా కమిటీ హెచ్చరించింది. ఎందుకు ముప్పు పొంచి ఉంది, వాటికి పరిష్కారాలను కూడా కమిటీ సూచించింది. సూచనలు అమలు చేయకపోతే డ్యామ్ కు ప్రమాదం ఉందని హెచ్చరించింది.. కాగా.. శ్రీశైలం డ్యామ్ భద్రతపై ఇప్పటికే అనేక కమిటీలు ఏర్పాటు అయ్యాయి. సూచనలు సలహాలు కూడా ఇచ్చాయి. అయితే 2020 ఫిబ్రవరి లో ఏర్పాటైన కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏ బి పాండ్య కమిటీ అతి కీలకమైనది. ఈ కమిటీ డ్యామ్ పరిశీలించి లోతైన తుది నివేదికను అందజేసింది. కమిటీ చైర్మన్ pandiya ఇచ్చిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్యాం ప్రస్తుతం ఉన్న స్పిల్ వే సామర్థ్యానికి తగ్గట్టుగా లేదని దీంతో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికి పలు కారణాలను , పరిష్కారాలను కూడా కమిటీ సూచించింది.

ప్రమాదం ఎందుకు ఉంది అంటే..

* శ్రీశైలం డ్యామ్ కు అంచనాలకు మించి గరిష్టంగా 26 లక్షల క్యూసెక్కుల వరద నీరు డ్యామ్ కు వచ్చే అవకాశం ఉంది.

* ప్రస్తుత డ్యామ్ స్పిల్ వే సామర్థ్యం కేవలం 13.2 లక్షల క్యూసెక్కులు మాత్రమే.

* ఇంకా ఎక్కువ తీసుకుంటే 14.55 లక్షల క్యూసెక్కులకు మించదు.

2009లో లో ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం డ్యామ్ ను తాకింది. అప్పట్లోనే స్పిల్వే పైన వరద నీరు ప్రవహించింది. ఇంత భారీ వరద వస్తే అన్ని గేట్లు ఎత్తి 14.8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదల గలిగారు. దీంతో డ్యాంకు గరిష్ట వరద నీటి కి తగ్గట్లుగా స్పిల్వే సామర్థ్యం లేదని ఋజువైంది. ఇదే విషయాన్ని pandiya కమిటీ ఆధారాలతో సహా నిరూపించి నివేదిక పంపింది.

డ్యామ్ కు ప్రధాన ముప్పు స్పిల్ వే సామర్థ్యం తక్కువగా ఉండటమే కారణమని చెప్తూనే మరికొన్ని కారణాలు కూడా డ్యామ్ కు ప్రమాదంగా ఉన్నాయని సూచించింది. స్పిల్ వే గేట్ల నుంచి నీళ్లు కిందపడి మళ్లీ ఎగిరే ప్రాంతం ప్లంజ్ పూల్ లో ఏర్పడిన భారీ గొయ్యి డ్యామ్ కు ప్రమాదంగా ఉన్నట్లు హెచ్చరించింది.. ఈ గొయ్యి పూడ్చివేత కు తక్షణమే చర్యలు చేపట్టాలని హెచ్చరించింది. ప్లంజ పూల్ కు ఉన్న కుడి ఎడమ గట్లను తదుపరి నష్టం రాకుండా కార్యాచరణ చేపట్టాలి. రివర్స్ స్లూయిస్ గేట్లు అత్యవసర సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున దృష్టి సారించాలి ఇప్పుడే.. అని పాండ్యా కమిటీ హెచ్చరించింది.

ప్రమాదం జరగకుండా పరిష్కార మార్గాలను కూడా పాండ్యా కమిటీ పలు సూచనలు చేసింది.

* గరిష్ట వరద ప్రవాహానికి స్పిల్ వే సామర్థ్యం తక్కువగా ఉన్నందున డ్యామ్ కు ఎగువ భాగంలో ఐదు కిలోమీటర్ల దగ్గర మరో స్పిల్వే నిర్మించాలి.

* స్పిల్ వే నిర్మిస్తే దానికి బ్రిచింగ్ సెక్షన్ ఉండాలి అంటే అత్యవసరమైతే గండి కొట్టేలా స్పిల్వే నిర్మించాలి.

* మరో స్పిల్వే నిర్మించ లేనిపక్షంలో డ్యాం ఎత్తు పెంచాలి.

* స్పిల్వే సామర్థ్యానికి మించి వరదలు వస్తే కొంత వరదలు కుడివైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లించాలి.

* ఎడమ వైపున ఎగువ భాగంలో నీటిని మళ్లించడానికి అనువైన ప్రాంతం కూడా ఉంది.

* కేంద్ర జల సంఘం, ఐఎండి వద్ద వరదనీటి అంచనాకు అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా పసిగట్టి డియల్ లోని నీటిని ముందుగానే ఖాళీ చేయడం ద్వారా ప్రమాదాన్ని నియంత్రించవచ్చు.

* ప్రస్తుత స్పిల్వే కు ఎక్కువ ఎత్తులో గేట్లు ఉండేలా మార్పుచేయడం, స్పిల్ వే క్రస్ట్ లెవెల్ తగ్గించడం పై ఆలోచించాలి. ప్రస్తుత గరిష్ట నీటి నిల్వకు తగ్గట్టుగా డ్యాం ఎత్తు పెంచితే ముంపు ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని AB పాండ్య కమిటీ సూచించింది.

* డ్యాం కుడి ఎడమ వైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.

కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ పాండ్య తుది నివేదిక ఇచ్చినందున దాని అమలు ఎంతవరకు ఎప్పటిలోగా సాధ్యమవుతుంది అనేది వేచి చూడాలి.

Also Read:

Gudur: కాలేజ్‌కి వెళ్తున్న కుమార్తె ఫ్రెండ్‌కి మాయమాటలు.. ఆపై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి

Smartphone Ban: ఆ యూనివర్సిటీలో ఫోన్లు నిషేధం.. తీసుకువస్తే అంతే సంగతులు.. హుకూం జారీ